బ్లడ్ బ్లాంకులోని రక్తం సురక్షితమా? రక్తమార్పిడి ద్వారా 2234 మందికి హెచ్ఐవీ!
గత 2014 అక్టోబరు నుంచి 2016 మార్చి వరకు బ్లడ్ బ్యాంకుల ద్వారా రక్తాన్ని సేకరించి.. రక్తమార్పిడి చేసుకున్న రోగుల్లో 2234 మందికి ప్రాణాంతక హెచ్ఐవీ వైరస్ సోకినట్టు తేలింది.
దేశంలోని బ్లడ్ బ్లాంకుల్లో నిల్వ ఉన్న రక్తం సురక్షితమా? కాదా? అనే అంశంపై ఇపుడు చర్చకు తెరలేసింది. గత 2014 అక్టోబరు నుంచి 2016 మార్చి వరకు బ్లడ్ బ్యాంకుల ద్వారా రక్తాన్ని సేకరించి.. రక్తమార్పిడి చేసుకున్న రోగుల్లో 2234 మందికి ప్రాణాంతక హెచ్ఐవీ వైరస్ సోకినట్టు తేలింది.
నిజానికి అత్యవసర పరిస్థితుల్లో రక్తమార్పిడి చేయించుకోవడం తప్పనిసరి. ఇందుకోసం బ్లడ్ బ్యాంకులలో రక్తాన్ని క్షుణ్ణంగా, అన్నిరకాల పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే దాన్ని రోగులకు ఇస్తారు. కానీ.. రక్తమార్పిడి కారణంగానే మన దేశంలో 2234 మందికి హెచ్ఐవీ సోకింది. ఈ విషయం సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిసింది.
చేతన్ కొఠారీ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. చాలావరకు బ్లడ్‌బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, దానివల్లే ప్రజలు ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారని ఇటీవల వెల్లడైన ఓ నివేదికలో కూడా తెలిపారు. రక్తాన్ని సరిగా పరీక్షించకపోవడం వల్లే 2234 మందికి పైగా హెచ్ఐవీ బారిన పడ్డారు. అత్యధికంగా యూపీలో 361 మంది, తర్వాత గుజరాత్‌లో 292 మందికి ఈ వ్యాధి సోకింది.