Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కబళిస్తోన్న మధుమేహం.. నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు.. డబ్ల్యూహెచ్‌వో

Diabetes
, మంగళవారం, 15 నవంబరు 2022 (13:36 IST)
దేశాన్ని మధుమేహం మెల్లగా కబళిస్తోంది. మధుమేహం బారిన పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇందుకు కారణం మారిన జీవనశైలినే కారణం. డయాబెటిస్‌పై సరైన అవగాహన కల్పించాలని సోమవారం 'ప్రపంచ డయాబెటిస్‌ దినం' సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో పిలుపునిచ్చింది. 
 
డయాబెటిస్ కారణంగా రోగులకు కిడ్నీ సమస్య, గుండెపోటు, స్ట్రోక్, ఇతర అంగాలపై దుష్ప్రభావం పడనుంది. అందుకే డయాబెటిస్ రోగులు ఆహారపదార్ధాలపై శ్రద్ధ పెట్టాలి. వ్యాయామంపై దృష్టి కేంద్రీకరించాలని డబ్వ్యూహెచ్‌వో తెలిపింది. 
 
మధుమేహాన్ని అదుపుచేసేందుకు మధుమేహంపై విద్యను బలోపేతం చేయాలి. ప్రాథమిక స్థాయి నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్థులు మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఉదాహరణకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలి. అలాగే  ద్వారా తరచుగా మూత్ర విసర్జన, దాహం, నిరంతరం ఆకలి, బరువు తగ్గడం, దృష్టిలో మార్పులు, అలసట వంటి లక్షణాలను గుర్తించాలి. 
 
మధుమేహంతో జీవించే వ్యక్తులు TB బారిన పడే ప్రమాదం 1.5 రెట్లు ఎక్కువ. గర్భధారణ మధుమేహం నవజాత శిశువుల అనారోగ్యం, మరణాల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే మధుమేహం పట్ల అప్రమత్తంగా వుండాలని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిక్కుడు కాయలు తింటుంటే ఏం జరుగుతుందో తెలుసా?