మైదాపిండి తింటే మధుమేహం తప్పదు..
మైదాపిండితో చేసే ఆహార పదార్థాలను లాగిస్తున్నారా? రుచిగా వున్నాయని పరోటాలు తీసుకుంటే మధుమేహం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదాపిండిని గోధుమల నుంచి తయారవుతున్నా.. వాటిలో కలిపే రసాయనాల ద్వా
Publish Date: Mon, 18 Dec 2017 (07:57 IST)
Updated Date: Mon, 18 Dec 2017 (08:01 IST)
మైదాపిండితో చేసే ఆహార పదార్థాలను లాగిస్తున్నారా? రుచిగా వున్నాయని పరోటాలు తీసుకుంటే మధుమేహం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదాపిండిని గోధుమల నుంచి తయారవుతున్నా.. వాటిలో కలిపే రసాయనాల ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని వారు చెప్తున్నారు.
మైదాపిండిలో కార్బోహైడ్రేట్లను అధిక స్థాయిలో కలిగి ఉండి, చాలా తక్కువ మోతాదులో పోషకాలను కలిగి ఉంటుంది. తద్వారా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు తప్పవు. మైదాపిండి తయారీలో భాగంగా అందులో కలిపే ఫోలిక్ యాసిడ్ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం వుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మైదాలో పొటాషియం అధికంగా జోడిస్తారు. ఇవి శరీర కణాలకు మంచిది కాదు. క్యాన్సర్‌కు కారకమవుతుంది. హానికరమైన ప్రభావాలను కలుగజేసే అల్లాక్సాన్ మైదాలో వుంటుంది. దీనివల్ల మధుమేహం తప్పదు.
మైదాను ఉపయోగించి చేసే పిజ్జా, కుకీస్, పాస్తా, ఫాస్ట్‌ఫుడ్స్ తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో అవశ్యం లేని అమైనో ఆమ్లాన్ని కలుపుతున్నారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మైదాపిండిని డైట్‌లో చేర్చుకోకపోవడమే ఉత్తమం.
selvi
Publish Date: Mon, 18 Dec 2017 (07:57 IST)
Updated Date: Mon, 18 Dec 2017 (08:01 IST)