Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శరీరంలో అసలు కొవ్వే లేకుంటే?

శరీరంలో అసలు కొవ్వే లేకుంటే?
, బుధవారం, 26 మే 2021 (23:02 IST)
శరీర రంగు ఏదైనా ఉండొచ్చు. కాని ముఖంలో కళ ఉట్టిపడాలంటే తప్పనిసరిగా యోగా చేయాలి. దీంతో ప్రతి ఒక్కరి దృష్టి మీపైనే ఉంటుంది. ముఖంలో ఉట్టిపడే కళకు మనయొక్క కడుపుకు సంబంధం ఉంది. ఇవి రెండు శుభ్రంగా ఉంచుకోవడానికి నాలుగు ఉపాయాలున్నాయి. వీటిని తప్పనిసరిగా పాటించాలంటున్నారు యోగా నిపుణులు. 
 
1. కంఠాన్ని శుభ్రం చేసుకోవాలి. 2. నోటికి సంబంధించిన వ్యాయామము, బ్రహ్మముద్ర. 3. సర్వాంగాసనం మరియు శీర్షాసనం వేయాలి. 4. జలనేతి మరియు కపాల భాంతి ప్రాణాయామం. వీటిని చేసిన తర్వాత ఐదు నిమిషాల వరకు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. 
 
శరీరం ఆరోగ్యంగా ఉంటే ఆకర్షణీయంగా కూడా కనపడుతుంటారు. దీంతో శరీరం అందంగా కనపడుతుంది. శరీర సౌందర్యం మన వెన్నెముక, శరీర కండరాలపై ఆధారపడి వుంటుంది. శరీరంలో అనవసరమైన కొవ్వు ఉంటే అది వెన్నెముకకు, శరీర కండరాలకు హాని చేస్తుంది. అలాగే శరీరంలో అసలు కొవ్వే లేకుంటే కూడా చాలా ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. దీనికి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. దీనికి కూడా నాలుగు ఉపాయాలున్నాయంటున్నారు యోగా నిపుణులు. 
 
1. సూక్ష్మమైన వ్యాయామం చేయండి. 2. ఆరు ఆసనాలు తప్పనిసరిగా చేయాలి- తాడాసనం, త్రికోణాసనం, పశ్చిమోత్తాసనం, ఉష్ట్రాసనం, ధనురాసనం, నౌకాసనం. 3. ప్రాణాయామం. 4. మాలిష్. ఇవి చేస్తే సౌందర్యరాశి అవుతారంటున్నారు. 
 
ఇవి తప్పనిసరిగా చేస్తే శరీర రంగు ఏదైనా ఉండొచ్చు అమ్మాయిల శరీరం కోమలంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటూ, ముఖం కళ కళలాడుతుంది. అలాగే ఆహారంలోకూడా జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు యోగా గురువులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుపు పంచదారలో మంచిదా..? తాటిబెల్లం మంచిదా..?