పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏమిటి?
పిల్లలు పుట్టకపోతే కలిగే బాధేమిటో ఆ దంపతులకే తెలుస్తుంది. కాకపోతే తమ లోపాలేమిటో తెలుసుకునే విషయంలో చాలామంది దంపతులు బాగా ఆలస్యం చేస్తారు. అందుకు గల కారణాలను తెలుసుకుని సరైన వైద్యుడ్ని సంప్రదించాలి. సంతానం కలగడంలో స్థూలకాయం పెద్ద అవరోధంగా ఉంటుంది. శరీ
పిల్లలు పుట్టకపోతే కలిగే బాధేమిటో ఆ దంపతులకే తెలుస్తుంది. కాకపోతే తమ లోపాలేమిటో తెలుసుకునే విషయంలో చాలామంది దంపతులు బాగా ఆలస్యం చేస్తారు. అందుకు గల కారణాలను తెలుసుకుని సరైన వైద్యుడ్ని సంప్రదించాలి. సంతానం కలగడంలో స్థూలకాయం పెద్ద అవరోధంగా ఉంటుంది. శరీరం బరువు పెరిగిపోయినప్పుడు హర్మోన్ సంబంధిత మార్పులు వస్తాయి. ప్రత్యేకించి గొనాడో ట్రోఫిన్ రిలీజింగ్ హర్మోన్ వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు.
మద్యం మరియు పొగాకు వల్ల ఎర్రరక్తకణాలు తగ్గిపోయి శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుంది. ఇది కూడా సంతాన లేమికి కారణమవుతుంది. కొందరిలో వంశానుగతంగా కూడా వీర్యకణాలు తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. మరికొందరిలో డిఎన్‌ఏ దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
ఎక్కువ గంటలు సైకిల్ తొక్కడం, గుర్రపు స్వారీ చేయడం, అధిక ఉష్టోగ్రతలో పనిచేయడం, ఎక్కువ గంటలు కంప్యూటర్ల ముందు కూర్చోవడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. వృషణాల్లోంచి పురుషాంగంలోకి వచ్చే మార్గంలో ఏర్పడే అడ్డంకుల వల్ల అంటే వ్యాన్ డిఫరెన్స్ ఆబ్‌స్ట్రక్షన్, ల్యాక్ ఆఫ్ వ్యాస్ ఢిఫరెన్స్ వంటి సమస్యలు కూడా సంతానలేమికి కారణమవుతాయి. శీఘ్రస్థలన సమస్యకూడా ఇందుకు కారణమే.
పైన తెలిపిన కారణాలే కాకుండా వీర్యకణాల సామర్థ్యాల మీద సంతానం విషయం ఆధారపడి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా అసలే వీర్యకణాలు లేకపోవడం, వీర్యకణాల సంఖ్య అవసరమైనంత లేకపోవడం, వీర్యకణాల్లో స్త్రీ అండాశయంలోకి దూసుకువెళ్లే చలన శక్తి లేకపోవడం ఇవన్నీ కారణాలే.