శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌కి తగ్గట్లుగా మన ఆహారం కూడా మార్చుకోవాలి. గుండె ఆరోగ్యంతో ఇతరత్రా వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే శీతాకాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాము. శీతాకాలంలో విటమిన్ సి, విటమిన్ కె వున్నటువంటి ఆకుకూరలను తీసుకుంటుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
క్యారెట్లు, బీట్ రూట్ వంటి దుంపకూరలను తీసుకుంటే వాటితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
నారింజ, ద్రాక్ష, నిమ్మ, స్ట్రాబెర్రీ, కివీ వంటి పండ్లను తింటుండాలి. వాటిలో విటమిన్ సి అధికంగా వుంటుంది. కోడిగుడ్డు తెల్లసొన, పాలు, పుట్టగొడుగులు తింటుంటే విటమిన్ డి అందుతుంది.
చిక్కుడు కాయలు ఆహారంలో భాగంగా చేసుకుంటే వాటి ద్వారా అమైనా యాసిడ్లు చేరి మేలు కలుగుతుంది.
ఫైబర్ పుష్కలంగా వుండే ఓట్స్, గోధుమ పిండితో చేసిన రోటీలు తినాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాపప్పుల్లో యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి.