బరువు తగ్గడానికి టమోటాలు మేలు చేస్తాయి. టొమాటోలు గర్భిణీ స్త్రీలకు ఫ్రెండ్లీ వెజిటబుల్. టొమాటో తింటే తక్షణమే శరీరానికి శక్తి అందుతుంది. టొమాటోలు తింటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న టొమాటోలు రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
టొమాటోలులో వుండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే ఖనిజం. టొమాటోలను తరచుగా తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, టొమాటోలో బీటా-కెరోటిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి, ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి.
విటమిన్ కె, కాల్షియం ఉండటం వల్ల టొమాటోలు ఎముకలు, దంత ఆరోగ్యానికి తోడ్పడతాయి. టొమాటోలు లైకోపీన్, విటమిన్లు కలిగి వుండటం వల్ల ప్రోస్టేట్, కొలొరెక్టల్, స్టొమక్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి.