Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉడికించిన కందగడ్డలను నూనెలో వేయించి..?

Advertiesment
ఉడికించిన కందగడ్డలను నూనెలో వేయించి..?
, మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (13:16 IST)
ఈ కాలంలో కందగడ్డలు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని కొన్ని ప్రాంతాల్లో చిలగడ దుంపలు, గెనుసు గడ్డలు అని కూడా పిలుస్తారు. ఇక ఇంగ్లి‌ష్‌లో స్వీట్ పొటాటోస్ అని అంటారు. ఎలాంటి పేరుతో పిలిచినా వీటిని తినడం వలన కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం..
 
హైబీపీ, డయాబెటిస్ వ్యాధులతో బాధపడేవారు తరచు కందగడ్డలను తింటే వ్యాధి నుండి కాస్తైనా విముక్తి లభిస్తుంది. వీటిని ఉడికించి తీసుకోవడం కంటే పచ్చిగా తింటేనే మంచిదంటున్నారు వైద్యులు. అధిక బరువును తగ్గించాలంటే.. ఉడికించిన కంద గడ్డలలో కొద్దిగా ఉప్పు, కారం కలిపి తింటే ఫలితం కనిపిస్తుంది. అలా కాకుంటే.. వీటితో తయారుచేసిన జ్యూస్ తాగితే కూడా మంచిదే.
 
ఒత్తిడి అధికంగా ఉన్నావారు కందగడ్డలను క్రమంగా తినాలి. వీటిల్లోని పొటాషియం, బీటా కెరోటిన్స్, విటమిన్ ఎ వంటి లవణాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. మూత్రపిండాలకు మేలు చేస్తాయి. కందగడ్డలను తరచు తినడం వలన ఎర్రరక్తకణాల సంఖ్య పెరుగుతుంది. తద్వారా రక్తం బాగా తయారవుతుంది. అలానే జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది.
 
కంద గడ్డల్లోని విటమిన్ బి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. వీటిల్లో విటమిన్ సి కూడా అధిక మోతాదులో ఉంటుంది. ఇది శరీరంలో చేరే హానికారక బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తంది. అలానే ఎముకలు, దంతాలను దృఢంగా మార్చుతుంది. కందగడ్డలను బాగా ఉడికించుకుని అందులో కొద్దిగా ఉప్పు, కారం, మొక్కజొన్న పిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, వంటసోడా, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి ఉండలుగా చేసుకుని నూనెలో వేయించి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఇలాంటి తింటుంటే గుండె సంబంధిత వ్యాధులు రావు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుటుంబ కలహాలతో భార్యను కాల్చిచంపిన భర్త.. టెక్సాస్‌లో తెలుగు భర్త దారుణం