Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"టీ" తాగితే డెత్ రిస్క్ తగ్గుతుందట.. (video)

Advertiesment
Tea
, శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (13:03 IST)
Tea
భారత్‌తో పాటు ప్రపంచంలో అనేక దేశాల ప్రజలు ఎక్కువగా తీసుకునే పానీయం టీ. ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని కలిగించడంలో తేనీటికి మించిన ఆయుధం లేదు. టీ గురించి కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చింది. 
 
టీ ఎక్కువగా తీసుకుంటే డెత్ రిస్క్ తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. టీ తాగనివారితో పోలిస్తే రోజుకు రెండు లేదా మూడు కప్పులు తాగేవారిలో మరణ ప్రమాదం తక్కువని డేటా విశ్లేషణ స్పష్టం చేసింది.
 
యూకేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు బ్లాక్ టీ వల్ల కలిగే సంభావ్య మరణాల ప్రయోజనాల గురించి తమ విశ్లేషణలో తెలుసుకున్నారు. రోజుకు రెండు కప్పులకు పైగా టీ తాగే వ్యక్తుల్లో ఏ కారణం చేతనైనా మరణించే ప్రమాదం తాగని వారికంటే 9% నుంచి 13% వరకు తక్కువని NIH ఒక ప్రకటనలో తెలిపింది. 
 
40 నుండి 69 ఏళ్ల వయసు గల 4,98,043 మంది పురుషులు, స్త్రీలు ఈ అధ్యయనంలో పాల్గొనగా.. వీరిలో 89 శాతం మంది బ్లాక్ టీ వెరైటీని తాగినట్లు చెప్పారు. అయితే ఇక్కడ బ్లాక్‌ టీ తాగే అలవాటు లేకుంటే పాలు లేదా చక్కెర జోడించినప్పటికీ ఆరోగ్య ప్రయోజనాల్లో గణనీయమైన తగ్గింపు కనిపించలేదు. కాకపోతే చక్కెర, పాలలోని సంతృప్త కొవ్వులను పరిమితం చేయడాన్ని ఆరోగ్య నిపుణులు ప్రోత్సహిస్తున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొవ్వు-కొలెస్ట్రాల్ ఎలా చేరుతుంది? అధికమైతే ఏమవుతుంది?