Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సూపర్ మార్కెట్ చికెన్‌లో ఈ-కోలీ బ్యాక్టీరియా.. లొట్టలేసుకుని తిన్నారో అంతే సంగతులు...

చికెన్‌లో బ్యాక్టీరియానా.. వామ్మో వద్దే వద్దు అనుకుంటున్నారు కదూ. నిజమేనండి. అయితే ఇది మనదేశానికి సంబంధించిన వార్త కాదు. బ్రిటీష్ దుకాణాల్లో తాజా చికెన్ అంటూ అమ్మే చికెన్‌ను తీసుకుంటే, అనారోగ్యాలు తప్

Advertiesment
Two in three chickens sold in British supermarkets are 'infected with E.coli superbug'
, సోమవారం, 21 నవంబరు 2016 (15:45 IST)
చికెన్‌లో బ్యాక్టీరియానా.. వామ్మో వద్దే వద్దు అనుకుంటున్నారు కదూ. నిజమేనండి. అయితే ఇది మనదేశానికి సంబంధించిన వార్త కాదు. బ్రిటీష్ దుకాణాల్లో తాజా చికెన్ అంటూ అమ్మే
చికెన్‌ను తీసుకుంటే, అనారోగ్యాలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కోడిపిల్లలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా వుండాలనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా వాటికి యాంటీ బయోటిక్ మందుల్ని ఎక్కువ మోతాదులో కలిపేస్తుంటారు. దీంతోనే సూపర్ బగ్ తయారైంది. కోడిపిల్లలకు యాంటీ బయోటిక్స్ కూడా ఇవ్వడంతో అవి పనిచేయక.. చివరకికి మనుషుల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తున్నాయని వారు చెప్తున్నారు. 
 
ముఖ్యంగా ఈ ప్రమాదం బ్రిటిష్ దుకాణాల్లో అధికమని, దాదాపు మూడింట రెండొంతుల చికెన్‌లో ప్రమాదకరమైన ఈ-కోలి సూపర్ బగ్ ఉందని పరిశోధకులు చెప్తున్నారు. ఇంకా ఇంగ్లండ్‌లోని ప్రముఖ దుకాణాల్లో అమ్ముతున్న చికెన్‌లో 78 శాతం ఈ-కోలి బ్యాక్టీరియా కలిగి ఉందట. అదే స్కాట్లాండ్‌లో 53 శాతం, వేల్స్‌లో 41 శాతం చికెన్‌లో ఈ-కోలి ఉందన్నారు. 
 
అత్యంత ప్రమాదకరమైన ఈ-కోలి బ్యాక్టీరియా వల్ల ఒక్క ఇంగ్లండ్‌లోనే ఏడాదికి 5,500 మంది చనిపోతున్నారు. ఈ కోలి బ్యాక్టీరియా వల్ల కేవలం డయేరియా లేదా వాంతులు కావడం మాత్రమే కాదని, అది పెద్దప్రేవుల్లో కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోయి ప్రాణాంతకంగా మారుతుందని పరిశోధకులు తెలిపారు. ఇకపోతే, ఇ-కోలీ బ్యాక్టీరియాపై ఎలాంటి యాంటీబయోటిక్ మందులు పనిచేయవని, సూపర్ మార్కెట్లలో లభించే చికెన్‌లో ఈ-కోలి తప్పకుండా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ప్రస్తుతం ఈ-కోలీ బ్యాక్టీరియా తీవ్రత అధికంగా ఉన్నట్లు పరశోధకులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుండె నొప్పి రాకూడదా.. అయితే జాజికాయ వాడండి..!