Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుండె నొప్పి రాకూడదా.. అయితే జాజికాయ వాడండి..!

జాజికాయ విలువైన ద్రవ్యము. మెత్తని కలపజాతికి చెందిన మ్రొక్క. దీని చెక్కతో పెట్టెలు తయారు చేస్తారు. జాజి చెట్టు కాయలు ఉసిరిక కాయలు పరిమాణంలో ఉంటాయి. వీటి గింజలు పొగాకు విత్తనాల వలె తెల్లగా ఉంటాయి. వీనిన

గుండె నొప్పి రాకూడదా.. అయితే జాజికాయ వాడండి..!
, సోమవారం, 21 నవంబరు 2016 (09:33 IST)
జాజికాయ విలువైన ద్రవ్యము. మెత్తని కలపజాతికి చెందిన మ్రొక్క. దీని చెక్కతో పెట్టెలు తయారు చేస్తారు. జాజి చెట్టు కాయలు ఉసిరిక కాయలు పరిమాణంలో ఉంటాయి. వీటి గింజలు పొగాకు విత్తనాల వలె తెల్లగా ఉంటాయి. వీనిని గసగసాలు అనే పేరుతో పిలుస్తారు.
 
జాజికాయలో కామెర్ల వ్యాధిని తగ్గించే స్వభావం ఉంది. నాలుకమీది పాచిని పోగొట్టి జిగటను తొలగిస్తుంది. పిల్లలకు కలిగే నీళ్ళ విరేచనాలను తగ్గిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసి మలబద్దకాన్ని తొలగిస్తుంది. శరీరానికి కాంతిని కలిగిస్తుంది. గుండె నొప్పిని తొలగించి బిపిని కంట్రోలు చేయగలుగుతుంది. అయినా దీని ఎక్కువగా వాడితే మిక్కిలి మత్తునూ, నిద్రనూ కలిగిస్తుంది. 
 
జాజికాయ మాదక (మత్తును) కలిగిస్తుంది. జ్వరాన్ని తగ్గించి దప్పికను అరికడుతుంది. జాజికాయ పొడిని, ఆవుపాలతో గానీ, మేకపాలతో గానీ తగుమాత్రంగా తీసుకుంటే మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది. జాజికాయ, సొంఠి అరగదీసి కణతలకు పట్టు వేస్తే సాధారణ తల నొప్పేగాక మైగ్రేన్‌ కూడా తగ్గుతుంది.
 
జాజికాయను కిళ్ళీలో ఒక చిన్న ముక్కను వాడుతారు. అది నోటి దుర్వాసనను అరికడుతుంది. జాజికాయ ముక్కను నములుతుంటే పండ్లలోని క్రిములు కూడా నశించే అవకాశముంది. దీని గంధం 2-3బొట్లు చెవిలో పిండితే సాధారణ చెవిపోటుకు పనిచేస్తుంది.
 
జాజికాయ గొప్ప పవర్‌ గల వస్తువు. సంభోగ శక్తిని పెంచుటలో దీనికిదే సాటి. కొన్ని వైద్య గ్రంతాలు దీన్ని మహాయోగమని పేర్కొన్నారు. జాజికాయను తుమ్మ జిగురు, ధనియాల రసు, ఫేనము, గులాబీ రసం వీటిలో దేనిలోనైనా వాడుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లల్లో ఎముకల బలానికి చేపలు తినిపించాల్సిందే.. మెదడుకూ మేలేనట