Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొవ్వు కరగాలంటే ఆవనూనెతో పచ్చకర్పూరాన్ని (వీడియో)

కొవ్వు కరగాలంటే ఆవనూనెతో పచ్చకర్పూరాన్ని (వీడియో)
, శుక్రవారం, 25 మార్చి 2022 (00:02 IST)
అరగ్లాసు కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు పంచదార, చిటికెడు కర్పూరం, చిటికెడు ఉప్పు కలిపి రెండు గంటలకు ఒకసారి సేవిస్తుంటే నీళ్ల విరేచనాలు, కలరా వ్యాధి తగ్గుతాయి. అంతేకాకుండా నీరసం, నిస్త్రాణ కూడా తగ్గుతాయి.

 
ఆవనూనెను వేడిచేసి, నాలుగవ వంతు కర్పూరాన్ని అందులో కరిగించి చల్లార్చి నిలువ ఉంచుకుని, తొడలు, ఉదరం మొదలైన భాగాల్లో మర్దనా చేస్తుంటే ఆయా భాగాల్లో సంచితమైన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. రొమ్ములపై గడ్డలున్న చోట మర్దనా చేస్తుంటే కొన్ని విధాలైనా గడ్డలు కరిగిపోతాయి. పాదాలు, అరచేతుల చర్మం బిరుసెక్కి పగుళ్లతో బాధపడేవారు, కొబ్బరినూనెలో పసుపు, కర్పూరం కలిపి రంగరించి రాస్తుంటే చక్కటి ఫలితం ఉంటుంది.

 
పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని తగినంత ఎండుద్రాక్ష కలిపి నూరి సెనగలంత మాత్రలు చేసుకుని రాత్రి నిద్రకు ముందు ఒక మాత్ర చొప్పున కప్పు పాలతో సేవిస్తుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్య తగ్గి శృంగార సామర్థ్యం పెరిగి, దాంపత్య సమయంలో సంతృప్తి కలగడమే కాక సంభోగం తరువాత నీరసం లేకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది.

 
మిరియాలు, కర్పూరం, నల్ల జీలకర్ర పొడి, ఏలుకల చూర్ణాలను సమానంగా కలిపి ముక్కుపొడుంలా పీలుస్తుంటే, ముక్కు, సైనస్ తదితరభాగాల్లో సంచితమైన శ్లేష్మమంతా సులువుగా బయటకు వెళ్లి ముక్కుదిబ్బడ, తలబరువు, తలనొప్పి వంటి బాధలు తగ్గుతాయి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్షయవ్యాధి: నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మహమ్మారి