Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిక్స్ ప్యాక్స్ కోసం ఇవన్నీ తీసుకోండి..

సిక్స్ ప్యాక్స్ కోసం ఇవన్నీ తీసుకోండి..
, బుధవారం, 27 మార్చి 2019 (16:58 IST)
బలిష్టమైన కండరాల కోసం, సిక్స్ ప్యాక్ అబ్స్ కోసం కసరత్తులు చేస్తే సరిపోతుందని చాలా మంది భావిస్తారు. కానీ అలా అనుకుంటే పొరపాటే. వ్యాయామాలతోపాటు సరైన ఆహార ప్రణాళికను కూడా అనుసరించాల్సి ఉంటుంది. ఆహార ప్రణాళికను అనుసరిస్తున్నప్పుడు కొన్ని నియమాలు లేదా చిట్కాలు కూడా పాటించాలి, లేకపోతే ఫలితాలు తారుమారు అవుతాయి. 
 
సిక్స్ ప్యాక్ అబ్స్ కోరుకునే వారు పాటించాల్సిన కొన్ని పద్ధతులు ఇక్కడ పొందుపరిచి ఉన్నాయి. తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహార ప్రణాళికను అనుసరించినట్లయితే గ్లైకోజెన్ స్థాయిలను భర్తీ చేసే సామర్ధ్యం తగ్గి కండర నిర్మాణానికి మరియు కండరాలను క్రమబద్దీకరించడానికి మీ శరీరం అధికంగా సమస్యలను ఎదుర్కొంటుంది. 
 
కాబట్టి తక్కువ కార్బోహైడ్రేట్‌లు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోనవసరం లేదు. కణజాలాలను క్రియాశీలంగా ఉంచేందుకు కండరాలకు నిరంతరంగా శక్తి అవసరం. మీరు రోజులో 2500 క్యాలరీల ఆహార ప్రణాళికను అనుసరిస్తున్నట్లయితే, 310 గ్రాముల కార్బోహైడ్రేట్ల వరకూ తీసుకోవచ్చని గుర్తుంచుకోండి. 
 
సాధారణంగా మధ్యాహ్నం పూట ప్రొటీన్ అధికంగా గల ఆహారాన్ని తీసుకున్నట్లయితే శరీరంలో అదనపు క్రొవ్వు కరుగుతుంది. లీన్ కండరాలను వృద్ధి చేస్తుంది. ఆరోగ్యకరమైన క్రొవ్వులు కూడా శరీరానికి అవసరమే. అవకాడో, నట్ బట్టర్, చేప మరియు ఆలివ్ నూనె వంటి మోనో సాచురేటెడ్ మరియు పాలీ సాచురేటెడ్ కొవ్వులను ఆహారంలో భాగం చేసుకోండి. దీని వలన ఇన్సులిన్ స్థాయిలు క్రమబద్ధీకరించబడతాయి. 
 
వ్యాయామం చేయడం ద్వారా సిక్స్ ప్యాక్ అబ్స్ కూడా పొందవచ్చు. అనేక మంది రోజువారీ ఆహార ప్రణాళికలలో భాగంగా మూడు నుండి నాలుగు మీల్స్ తీసుకుంటారు. మధ్య మధ్యలో స్నాక్స్ కూడా తీసుకోరు. కండర నిర్మాణం కోరుకునే వారికి ఇది ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. క్రొవ్వులు, తీపి వస్తువుల జోలికి వెళ్లకుండా ప్రతి మూడు గంటలకు ఒకసారి పౌష్టికాహారం తీసుకోవాలి. గ్లైకోజెన్ స్థాయిలు క్రమంగా కాలేయం మరియు కండరాల కణజాలాలలో పెరుగుతాయి.
 
ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వుల నిష్పత్తి సరిగ్గా ఉండేలా చూసుకోండి. తద్వారా అదనపు క్రొవ్వు పేరుకోకుండా ఉంటుంది. ఆబ్స్ వర్కౌట్స్ ముందు, బ్రెడ్, అరటిపండు, పెరుగు, బెర్రీలు లేదా పీనట్ బట్టర్, మరియు ఒక గిన్నె నిండా మ్యూస్లీ తీసుకోవడం అలవాటు చేసుకోండి. వ్యాయామం తర్వాత ఫ్రూట్ షేక్స్ తీసుకోండి. 
 
మళ్లీ ఒక గంట తర్వాత వేయించిన కూరగాయలతో పాటుగా చికెన్ బ్రెస్ట్ లేదా చిలగడ దుంపలను తీసుకుంటే మంచిది. పిండిపదార్ధాలతో కూడిన భారీ అల్పాహారంతో మీ రోజును ప్రారంభించండి. దాంతో మీ కడుపు నిండుగా ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. అదనపు ఆహారం జోలికి వెళ్లరు. అదేవిధంగా రోజులో చివరి మీల్ అధికమైన కార్బొహైడ్రేట్స్ లేకుండా, లీన్ ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్క్‌కు వస్తామంటారు..?