Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుర్వాసనకు చెక్ పెట్టాలా? ఇవిగోండి చిన్న చిన్న టిప్స్..!

ఇప్పుడున్న కాలంలో వాతావరణ మార్పుల వల్ల ప్రతియొక్కరిని వేధించే సమస్య దుర్వాసన. అయితే ఈ దుర్వాసనకు చెక్ పెట్టాలంటే నానా హైరానా పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరి. అవేంటంటే...నిత్యం య

Advertiesment
Reducing
ఇప్పుడున్న కాలంలో వాతావరణ మార్పుల వల్ల ప్రతియొక్కరిని వేధించే సమస్య దుర్వాసన. అయితే ఈ దుర్వాసనకు చెక్ పెట్టాలంటే నానా హైరానా పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరి. అవేంటంటే...నిత్యం యాంటి బ్యాక్టీరియల్ సబ్బుల్ని ఉపయోగించాలి. శుభ్రమైన లోదుస్తులు ధరించాలి. కాటన్‌వి అయితే మరీ మంచిది. అవి చర్మంలోకి గాలి చొరబడేట్టు చేస్తుంది.
 
పళ్లు, కూరగాయలు తీసుకుంటే శరీరంలో దుర్వాసన శాతం సగానికి సగం తగ్గిపోతుంది. నీళ్లు బాగా తాగాలి. నీళ్లు తాగితే స్వేదగ్రంధులు బాగా పనిచేస్తాయి. దీంతో చెమట వాసన బాగా తగ్గిపోతుంది. స్నానం చేసిన తరువాత టాల్కం పౌడర్ వేసుకుంటే శరీరం పొడిగా ఉంటుంది. బ్యాక్టీరియా దరి చేరకుండా ఉంటుంది. అంతేకాదు కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు ఎక్కువగా తినడం తగ్గించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శరీరంపై ఎండ తగలకపోతే అంతే సంగతులు.. బరువు అమాంతంగా పెరుగుతారట!