ఉరుకులు పరుగులొద్దు.. ఉదయం లేవగానే ఇలా చేయండి..!
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో లేచిన దగ్గర్నుండి పడుకునే వరకు అన్నిపనులు హడావుడిగానే సాగుతుంటాయి. మనం నిద్ర లేచిన పద్దతిని బట్టే ఆ రోజు అంతా ఆధారపడి ఉంటుందంటే నమ్ముతారా... ఇది నిజం. ఆదరాబాదరగా రోజును మొదలుప
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో లేచిన దగ్గర్నుండి పడుకునే వరకు అన్నిపనులు హడావుడిగానే సాగుతుంటాయి. మనం నిద్ర లేచిన పద్దతిని బట్టే ఆ రోజు అంతా ఆధారపడి ఉంటుందంటే నమ్ముతారా... ఇది నిజం. ఆదరాబాదరగా రోజును మొదలుపెడితే చేయబోయే పనులపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు కొన్ని మెలకువలు పాటిస్తే మంచిది.
నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లుమూసుకుని కూర్చొని, ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదిలితే ఈ అలవాటు శ్వాసక్రియతో పాటు మీ మూడ్స్‌ను ఉత్సాహంగా ఉంచుతుంది.
నిద్రలేచిన వెంటనే ఫోన్లలో మాట్లాడడం మంచిది కాదు... ఒక్కోసారి అవి మూడ్‌ని పాడు చేయొచ్చు. నిద్రలేవగానే ఏవైనా హాస్య కథల్ని చదివితే ఆ రోజంతా హ్యాపీగా సాగుతుంది. లేచిన వెంటనే అందరికి గుడ్ మార్నింగ్ చెప్పి చిరునవ్వుతో పలకరించండి.
నిద్రలేవగానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతారు. అయితే వీటికన్నా నిమ్మకాయ నీళ్లు లేదా మంచినీళ్లు తాగితే మంచిది.
నిద్రలేచే సమయం కన్నా మరో గంట ముందుగా నిద్రలేచే అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే మేల్కోవడం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు అలవడుతుంది.
నిద్రలేచిన తర్వాత వ్యాయామం చేయడం చాలా మంచిది. రోజు హాయిగా ఉండడానికి ఉదయం సంగీతం వినడం మంచిది. సంగీతం మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది.