Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శృంగార సమస్యలను దూరం చేసే పదార్థం...

Advertiesment
శృంగార సమస్యలను దూరం చేసే పదార్థం...
, శుక్రవారం, 3 మే 2019 (21:24 IST)
మనం ఎల్లప్పుడు ఆరోగ్యంగా, వ్యాధులకు దూరంగా ఉండాలంటే మనం తినే ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుంది. తీసుకునే ఆహారం పట్ల ఎంతో అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా వ్యాధులకు దూరంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారపదార్థాలను తీసుకోవాలి. ఆరోగ్యకర ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కొన్ని రకాల వ్యాధుల ముప్పు నుండి తప్పించుకోవచ్చు. వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. ఆపిల్‌లో ఉండే ఫైబర్‌లు ఎక్కువ సమయం ఆకలి అవకుండా చూస్తాయి. వీటితో పాటుగా ఆపిల్‌లో పెక్టిన్, విటమిన్ సి, విటమిన్ బి కలిగి ఉంటాయి. శరీర శక్తిని పెంచటమే కాకుండా, వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ వ్యాధులకు దూరంగా ఉంచుతాయి. 
 
2. మోనో సాచురేటేడ్ కొవ్వు పదార్థాలను అధికంగా కలిగి ఉండే వాల్నట్స్ గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచటమే కాకుండా, లైంగిక వాంఛను కూడా పెంచి, శృంగార సమస్యలను కూడా దూరం చేస్తుంది. వీటిలో ఒమేగా ఫాటీ ఆసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. 
 
3. విటమిన్ సి అధిక మొత్తంలో కలిగి ఉండే బ్రోకలీ కొన్ని ప్రత్యేకమైన ఎంజైమ్‌లను కూడా కలిగి ఉంటుంది. వీటి వలన శరీరంలో కేన్సర్ వ్యాధి పెరుగుదల కూడా నివారించబడుతుంది. అంతేకాకుండా, దీనిలో ఉండే ఫైబర్ లు, రక్తపీడనాన్ని అదుపులో ఉంచి, గుండె సంబంధిత వ్యాధులకు గురవకుండా కాపాడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 
 
4. చేపలో ఎక్కువగా ఒమేగా ఫాటీ ఆసిడ్ లు ఉంటాయి. ఇవి మన శరీరంలోని చెడు కొవ్వు పదార్థాలను తగ్గించటమే కాకుండా, మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతాయి. అంతేకాకుండా, వీటిలో ఉండే ప్రోటీన్లు శరీరానికి అన్ని విధాల సహాయపడతాయి. సాల్మన్ ఫిష్ అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కావున వారంలో కనీసం 3 సార్లు అయిన వీటిని తీసుకుంటే మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవిలో చమట విపరీతం... ఒళ్లు పేలినప్పుడు ఏం చేయాలి...?