Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇలా స్నానం చేస్తే రోగాలు అస్సలు రావు...

స్నానం చేయడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిసిందే. దేహాన్ని శుభ్రంగా ఉంచడమే కాదు.. మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి కూడా స్నానం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే స్నానం చేసే సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే దేహానికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని జ్యోతి

ఇలా స్నానం చేస్తే రోగాలు అస్సలు రావు...
, గురువారం, 7 సెప్టెంబరు 2017 (20:03 IST)
స్నానం చేయడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిసిందే. దేహాన్ని శుభ్రంగా ఉంచడమే కాదు.. మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి కూడా స్నానం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే స్నానం చేసే సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే దేహానికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని జ్యోతిష్యం చెబుతోంది.
 
స్నానం చేసే ముందు నీటిలో కొద్దిగా నువ్వులను కలపాలి. ఐదు నిమిషాలు ఆగి ఆ నీటితో స్నానం చేయాలి. దీని వల్ల ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దాంతో అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. తలస్నానం చేసేటప్పుడు అయితే ముందుగా నీటిని తలపై పోసుకోవాలి. ఆ తరువాతే కింద భాగంలో నీరు పోయాలి. ఇలా చేయడం వల్ల ఒంట్లో ఉన్న విష పదార్థాలు పోవడమే కాకుండా శరీరంలోని వేడి తగ్గుతుంది. చలువ చేకూరుతుంది.
 
ఇప్పుడు చాలా కారణాల వల్ల కొంతమంది లేటుగా నిద్రలేచి ఎప్పుడో మధ్యాహ్నం తరువాత స్నానం చేస్తున్నారు. కొందరయితే ఉదయమంతా మానేసి రాత్రి పూట స్నానం చేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. వేకువ జామునే అంటే సూర్యుడు ఉదయించక ముందే తలస్నానం చేస్తే చాలా మంచిది.
 
స్నానం చేయడానికి అర్థగంట ముందే మీ శరీరాన్ని మీరే మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు రక్తప్రసరణ సరిగ్గా సాగుతుంది. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. స్నానం చేయడానికి ముందు షేవింగ్ అస్సలు చేయకూడదు. అలా చేస్తే చర్మం పాడవుతుంది. రంధ్రాలు పడతాయి. 
 
వ్యాయామం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. కొంతసేపు విరామం ఇచ్చిన తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు వంటి శ్వాసకోస సమస్యలు రావు. ఏదైనా నదుల్లో దిగేముందు ఓం అని అనుకోవాలి. అలా చేయడం చాలా మంచిది. అలా చెప్పడం వల్ల చాలామంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇది శృంగార హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో దిట్ట... తింటేనా...