Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరివేపాకు రుబ్బుకుని మూడు స్పూన్ల మెంతి పొడిని కలిపి జుట్టుకు ప్యాక్‌‌లా వేసుకుంటే?

కరివేపాకుని అందరు చాలా చిన్న చూపు చూస్తారు గాని దీని వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే ఇంకెప్పుడు కూడా కరివేపాకుని బయట పడేయరు. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆహారం ద్వారా కరివేపాకును

కరివేపాకు రుబ్బుకుని మూడు స్పూన్ల మెంతి పొడిని కలిపి జుట్టుకు ప్యాక్‌‌లా వేసుకుంటే?
, సోమవారం, 5 సెప్టెంబరు 2016 (14:18 IST)
కరివేపాకుని అందరు చాలా చిన్న చూపు చూస్తారు గాని దీని వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే ఇంకెప్పుడు కూడా కరివేపాకుని బయట పడేయరు. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆహారం ద్వారా కరివేపాకును తీసుకోవడం ద్వారా జుట్టు తెల్లబడవు. అతిపిన్న వయసులోనే జుట్టు నెరసిపోవడం వంటి సమస్యలకు కరివేపాకుతో చెక్ పెట్టవచ్చు. అలాంటి కరివేపాకు ఉపయోగాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
 
అరకేజీ నువ్వుల నూనెను బాగా మరిగించి అందులో 50 గ్రాముల పచ్చి కరివేపాకును వేసి మూతపెట్టాలి. మరుసటి రోజు ఆ నూనెను గోరువెచ్చగా వేడి చేసి, తలకు పట్టించి, కుంకుడు కాయతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే తెలుపు జుట్టు నలుపు జుట్టుగా మారిపోతుంది. 
 
చిన్న వయస్సులో జుట్టు నెరసి పోకుండా ఉండాలంటే.. ఒక కప్పు కరివేపాకును రుబ్బుకుని ఆ రసంలో మూడు స్పూన్ల మెంతి పొడిని కలిపి జుట్టుకు ప్యాక్‌లా వేసుకుని, ఎండిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే తెల్లజుట్టు నలుపుగా మారిపోతుంది.  
 
ఇంకా కరివేపాకు, గింజలు లేని ఉసిరికాయ, మందారం పువ్వుల్ని సమపాళ్లు తీసుకుని కాసింత నీరు చేర్చి రుబ్బుకోవాలి. తర్వాత ఆ రసాన్ని తలకు బాగా పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే.. మీ జుట్టు మృదువుగా తయారవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీలి రంగు కళ్లు గలవారు శాంత స్వభావులుగా.. చాలా స్మార్ట్‌గా ఉంటారట