Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీలి రంగు కళ్లు గలవారు శాంత స్వభావులుగా.. చాలా స్మార్ట్‌గా ఉంటారట

సర్వేంద్రియాణం.. నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మానవ శరీరంలో అత్యంత సున్నితమైనవి మన నేత్రాలు. మనుషుల మధ్య ప్రేమానుబంధాలు కళ్లతో మొదలై హృదయాన్ని చేరుకుంటాయని అంటుంటారు. మనిషికి ప్రపంచాన్ని చూపే ఈ కళ్లు

Advertiesment
evolution
, సోమవారం, 5 సెప్టెంబరు 2016 (13:42 IST)
సర్వేంద్రియాణం.. నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మానవ శరీరంలో అత్యంత సున్నితమైనవి మన నేత్రాలు. మనుషుల మధ్య ప్రేమానుబంధాలు కళ్లతో మొదలై హృదయాన్ని చేరుకుంటాయని అంటుంటారు. మనిషికి ప్రపంచాన్ని చూపే ఈ కళ్లు ఎంతో ముఖ్యమైనవి.

మానవుని శరీరంలో అన్ని అవయవాల్లోకి కన్ను చాలా ప్రధానమైందని, కంటికి సంబంధించి సమస్యలు రాకుండా చూసుకోవడం వల్ల జీవితాన్ని ప్రశాంతంగా తృప్తిగా గడపవచ్చని నిపుణులు అంటున్నారు. ఇంతటి విలువైన కళ్ల రంగును బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని, వారి మనసులో మెదిలే భావాలను ఇట్టే తెలుసుకోవచ్చునట. కళ్ల రంగులను బట్టి వారి వారి మనస్థత్వాలు ఎలా ఉంటాయో చెబుతున్నారు ప్రముఖ స్పిరిచ్యువల్ హీలర్ మధు కోటియా. 
 
సాధారణంగా ఎక్కువ మంది కళ్లు నల్ల రంగులో ఉంటాయి. నల్ల రంగు కళ్లు రహస్యాన్ని సూచిస్తాయట. వారి వద్ద ఏదో విషయం ఉందని భావించవచ్చు. వీరు అత్యధికులను నమ్ముతారు. ఒకరి రహస్యాలను మరొకరితో పంచుకోరు. ఎక్కువగా కష్టపడే లక్షణాన్ని కలిగివుంటారు. తమ ప్రతిభను ఇతరులకు ఎలా చూపించాలో వీరికి బాగా తెలుసు. 
 
బూడిద రంగు కళ్లు గల వారిలో హుందాతనం మూర్తీభవించి వుంటుంది. ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. చేయాలనుకున్నదాన్ని చేసుకుంటూ వెళ్లిపోయే రకం. ప్రేమ, రొమాన్స్ తదితరాలకు ఎక్కువ విలువనిస్తారు. మానసికంగా బలంగా ఉంటూ, పరిస్థితులను విశ్లేషించి కష్టకాలం నుంచి నెట్టుకు వచ్చేస్తారు.
 
గోధుమ రంగు కళ్లు ఆకర్షణీయంగా ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని, క్రియేటివిటీనీ ఎక్కువగా చూపుతారు. ఇతరులకు కొంచెం కఠినమైన వ్యక్తిత్వం కలవారిగా కనిపిస్తారు. అదే విధంగా లేత గోధుమ రంగులో కళ్లు ఉన్న వారు వారి పరిస్థితులకు తగ్గట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఇతరులకు వినోదాన్ని కలిగించాలని భావిస్తారు. సాహసాలు చేయడం వీరికి ఇష్టం. వీరు ఎదుటివారిని వెంటనే ఆకర్షించినప్పటికీ, ఆ బంధాన్ని దీర్ఘకాలం కొనసాగించడంలో విఫలమవుతారు. 
 
నీలి రంగు కళ్లు గల వారు శాంత స్వభావులుగా ఉంటారు. చాలా స్మార్ట్‌గా ఉంటూ ఇతరులను ఆకర్షిస్తారు. వారితో దీర్ఘకాల బంధాన్ని కొనసాగిస్తారు. నిజాయితీతో ఉంటూ ఇతరులను ఆనందంగా ఉంచేందుకు కృషి చేస్తారు. చుట్టూ జరుగుతున్న విషయాలను నిశితంగా గమనిస్తుంటారు. ఇక పచ్చ రంగు కళ్లు గల వారి విషయానికి వస్తే, వారు మరింత తెలివితేటలు కలిగి ఉంటారు. జీవితాంతం కొత్త విషయాల పట్ల ఆసక్తిని చూపుతారు. అయితే వీరు ఇతరులను చూసి అసూయపడుతుంటారు. అయితే చేసేది ఏ పని అయినా సరే ఆనందంగా చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ‌రువు త‌గ్గించే మిరియాల టీ...