Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

image

ఐవీఆర్

, మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (23:22 IST)
హెపాటోబ్లాస్టోమాతో బాధపడుతున్న 4 ఏళ్ల బాలుడికి విజయవంతంగా లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (ఎల్‌డిఎల్‌టి) నిర్వహించినట్లు మణిపాల్ హాస్పిటల్ (విజయవాడ), సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ ప్రకటించాయి. డా. ప్రదీప్ థామస్ చెరియన్ నేతృత్వంలోని బృందం చేసిన ఈ సంక్లిష్ట శస్త్రచికిత్సతో పిల్లల సంరక్షణను అందించడంలో ఆసుపత్రి నిబద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయి ని సాధించింది.
 
అడపాదడపా పొత్తికడుపు నొప్పి మరియు వాపు లక్షణాలతో బాధపడుతున్న నాలుగు సంవత్సరాల బాలు డిని 31న జూలై 2024  మణి పాల్ ఆసుపత్రిలో చేర్చారు. సమగ్ర పరీక్షల్లో ఆ బాలుడి  కాలేయం నందు కల కుడి లోబ్‌లో తక్కువ స్థాయి జీవక్రియపరంగా గాయం ఉన్నట్లు వెల్లడైంది. తదుపరి  హిస్టో పాథలాజికల్ పరీక్ష ద్వారా హెపాటోబ్లాస్టోమా సమస్య ఉందని నిర్ధారించడం జరిగింది. ఇది పిల్లలలో కాలేయ క్యాన్సర్ యొక్క అరుదైన రూపం. ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నందున, లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్పనిసరి అని నిర్ధారించారు.
 
1న ఆగస్టు 2024 జనరల్ అనస్థీషియా కింద, శస్త్రచికిత్స బృందం కాలేయ మార్పిడిని విజయవంతంగా నిర్వహించి, చిన్నారికి కొత్త జీవితాన్ని అందించింది. ప్రక్రియ సంక్లిష్టంగా ఉన్నప్పటికీ, వైద్య బృందం నైపుణ్యం ఎటువంటి ముఖ్యమైన ఇంట్రా ఆపరేటివ్ సమస్యలు లేకుండా ఆపరేషన్‌ సజావుగా జరిగేందుకు వీలు కల్పించింది.
 
"ఆ బాలుడు కోలుకోవడం, కాలేయ మార్పిడి ఫలితాలతో మేం చాలా సంతోషిస్తున్నాం. ఇది తక్షణ జోక్యం విలువను, అలాగే మా కాలేయ మార్పిడి విభాగం అత్యాధునిక సామర్థ్యాలను చాటిచెబుతుంది. ఈ విజయవంతమైన ఫలితం ఆ బాలుడి దృఢత్వం, మా విభిన్న నిపుణుల బృందం నిబద్ధత కారణంగా సాధ్యమైంది, ”అని డాక్టర్ ప్రదీప్ థామస్ చెరియన్ అన్నారు.
 
శస్త్రచికిత్స అనంతరం, రోగిని ఐసీయూలో క్రిటికల్ కేర్, పీడియాట్రిక్ మరియు మెడికల్ గ్యాస్ట్రో వైద్య బృందం నిశితంగా పరిశీలిం చింది. అక్కడ ఆ పిల్లవాడు ఐవీ యాంటీబయాటిక్స్, ఫ్లూయిడ్స్, ఇమ్యునోసప్రెసెంట్స్, సాధారణ గాయాలకు చేసే చికిత్సలతో సహా సమగ్ర శస్త్రచికిత్స అనంతర సంరక్షణను పొందాడు. చికిత్స తరువాత ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఆ బాలుడి పరిస్థితి బాగానే ఉంది. కాలేయ పనితీరు పరీక్షలలో గణనీయమైన మెరుగుదలను చూపించాడు. 9న ఆగస్ట్ 2024 ఆ బాలుడు నిలకడ స్థితిలో డిశ్చార్జ్ అయ్యాడు. డిశ్చార్జ్ తరువాత కోలుకో  డానికి వాడాల్సిన మందులను కూడా వైద్యులు సూచించారు.
 
విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ, "సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం అందించిన నిధులు మరియు మణిపాల్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో నాలుగేళ్ల బాలుడికి ఈ కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించడం జరిగింది. విజయవంతమైన కాలేయ మార్పిడి మా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అధునాతన వైద్య సంరక్షణ మరియు నైపుణ్యానికి నిదర్శనం. మా రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను అందించడానికి మణిపాల్ వైద్య బృందం కట్టుబడి ఉంది. సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను కచ్చితత్వంతో, శ్రద్ధతో నిర్వహించగల మా సామర్థ్యాన్ని ఈ వైద్య చికిత్స సందర్భం మరోసారి ప్రముఖంగా చాటిచెబుతుంది. ఆ బాలుడి జీవితం ఆశ, తిరిగి కోలుకోవడంతో కూడుకున్నది.  అలా కోలుకునే ప్రయాణంలో భాగం కావడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం” అని అన్నారు.
 
ఆ పిల్లవాడు ప్రస్తుతం ఇంట్లో కోలుకుంటున్నాడు. అతని ఆరోగ్యం, శ్రేయస్సుకు మద్దతు ఇచ్చేందుకు విజయ వాడలోని మణిపాల్ హాస్పిటల్‌లోని వైద్యబృందం అంకితభావంతో ఉంది. ఈ కాలేయ మార్పిడి విజయ వంతమైన ఫలితం పీడియాట్రిక్, ట్రాన్స్‌ప్లాంట్ మెడిసిన్‌లో ఆసుపత్రి నాయకత్వ స్థానాన్ని నొక్కి చెబుతుంది. అంతేగాకుండా ఇంకా అనేక కుటుంబాలకు ఆశాజనకంగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?