Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శృంగారసామ‌ర్థ్యాన్నిపెంచే అతిమ‌ధురం..!

శృంగారసామ‌ర్థ్యాన్నిపెంచే అతిమ‌ధురం..!
, మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (08:33 IST)
ఆయుర్వేద వైద్యంలో వాడే శక్తివంతమైన మూలిక‌ల్లో అతి మధురంకు చాలా ప్రాముఖ్య‌త ఉంది. దీన్ని ఇంగ్లిష్‌లో లిక్కొరైస్ అని పిలుస్తారు.

మధుయష్టి, యష్టి మధు, మధూక తదితర పేర్లు కూడా దీనికి ఉన్నాయి. ఇది పేరుకు తగినట్టుగానే తీయని రుచిని కలిగి ఉంటుంది. ఆయుర్వేద మందులమ్మే దుకాణాలతోపాటు ఇతర షాపుల్లోనూ అతి మధురం వేర్ల రూపంలో సులువుగా దొరుకుతుంది. దీని వల్ల మ‌నం ఎలాంటి అనారోగ్యాలను న‌యం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. అతి మధుర చూర్ణాన్ని గాయాలు, పుండ్లపై చల్లుతుంటే రక్త స్రావం తగ్గి అవి వేగంగా మానుతాయి. అతి మధురం, అశ్వగంధ చూర్ణాలను సమానంగా కలిపి పెట్టుకుని గ్లాస్ పాలలో ఒక స్పూన్ చూర్ణం, ఒక స్పూన్ పటికబెల్లం పొడి, నెయ్యి, తేనెలను కలిపి రోజుకు 1 నుంచి 2 సార్లు తాగుతుంటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
 
2. దీన్ని రోజూ అరకప్పు పాలలో కలిపి సేవిస్తుంటే బాలింతల్లో పాలు పెరుగుతాయి. బియ్యం కడుగు నీటితో దీన్ని తీసుకుంటే నోరు, ముక్కు తదితర భాగాల నుంచి కారే రక్తస్రావం, స్త్రీలలో అధిక బహిష్టు రక్తస్రావం తగ్గుతాయి.
 
3.అతి మధుర చూర్ణంతో పళ్లు తోముకుంటే పిప్పి దంతాలు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, నోటి పుండ్లు, నోటి దుర్వాసన వంటి సమస్యలు తగ్గుతాయి. అతి మధురం, ఎండు ద్రాక్షలను సమానంగా కలిపి దంచి ముద్ద చేసి ఉంచుకుని రోజుకు 2 సార్లు పూటకు 10 గ్రాముల చొప్పున చప్పరించి కప్పు పాలు సేవిస్తుంటే స్త్రీలలో రక్తహీనత వల్ల కలిగే నీరసం, ఆయాసం, అలసట, గుండె దడ, మలబద్దకం తగ్గుతాయి.
 
4. అతి మధురం చూర్ణాన్ని మూడు పూటలా పూటకు ఒక స్పూన్ వంతున అరకప్పు నీటిలో కలిపి సేవిస్తుంటే అధిక దాహం, ఎక్కిళ్లు, నోటిపూత, కడుపులో మంట, అధికవేడి, చర్మంపై వచ్చే దద్దుర్లు తగ్గుతాయి.
 
5. ప్రతి రోజూ అరచెంచా మోతాదుగా యష్టి మధు పొడిని గోరు వెచ్చని పాలలో కలుపుకుని తాగుతుంటే శరీరానికి మంచి ఔషధంగా పనిచేసి శరీరంలో మెలనిన్‌ను అదుపులో ఉంచి దేహానికి చక్కని కాంతిని కలిగిస్తుంది.
 
6. మలబద్దకం ఉన్న వారు గోరు వెచ్చని నీరు లేదా పాలలో అరచెంచా యష్టిమధు పొడిని కలిపి ప్రతి రోజూ సాయంత్రం పూట తీసుకుంటే మరుసటి రోజు ఉదయం సాఫీగా విరేచనం అవుతుంది.
 
7. అతి మధురంతో తయారుచేసిన కషాయంలో కొద్దిగా తేనెను కలిపి గొంతుకు తగిలేలా తాగితే పొడి దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని చూర్ణాన్ని ప్రతి రోజూ రెండు పూటలా తేనెతో కలిపి తీసుకుంటే కడుపులో మంట తగ్గుతుంది.
 
8.అతి మధురాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీరు త్రాగాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరోగ్యం అనగా ఏమిటి?