పెద్దల ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదనీ, ముఖ్యంగా ఆడపిల్లలు కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదని పెద్దలు చెబుతుంటారు. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని అమెరికా వైద్యులు నిర్థారించారు.
రోజులో ఎక్కువ సమయం కాలు మీద కాలువేసుకుని కూర్చోవడం వల్ల అనేక అనర్థాలు ఎదురవుతాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు టైట్ డ్రస్‌లు వేసుకుని ఎక్కువగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల ఎముకల నొప్పులు లేదా మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు దీనిపై పరిశోధన చేయగా, కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవారిలో మోకాళ్ళ నొప్పులు వచ్చినట్లు తేలిందంటున్నారు. మోకాళ్ళ నొప్పుల రోగులను పరిశీలించిన తరువాత వైద్యులు ఈ విషయాన్ని నిర్థారించారు. నడుము కింద భాగం, రెండు కాళ్ళను కలుపుతూ పెల్విన్ అనే పెద్ద ఎముక ఉంటుంది. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నప్పుడు పెల్విన్ పై ప్రభావం పడి కాళ్ళు, నడుము నొప్పులు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.