Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేసవికాలంలో పండ్లు, ఆకుకూరలను తీసుకుంటే?

Advertiesment
Summer
, ఆదివారం, 22 మార్చి 2020 (11:47 IST)
వేసవికాలంలో పుదీనా, కీరా దోసకాయ, పెరుగు, లస్సీ వంటివి తీసుకోవడం వల్ల కూడా శరీర వేడి తగ్గుతుంది. అలాగే మజ్జిగను తీసుకుంటే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్లాస్ గోరువెచ్చని పాలల్లో తేనె కలుపుకొని రోజూ తాగితే వేడిని తగ్గించుకోవచ్చు. వేసవిలో గసగసాలను పొడిచేసి వేడి పాలలో కలుపుకొని తాగాలి. పుచ్చకాయ తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. 
 
రోజు ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ రెండు సార్లు కొబ్బరి నీళ్లు తప్పనిసరిగా తాగాలి. రోజూ స్పూన్ మెంతుల్ని ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే నిత్యం కాసేపు వ్యాయమం చేసిన తర్వాత గుప్పెడు ద్రాక్షలను తీసుకుంటే అలసిపోయిన శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. అలసటలో ఉన్నప్పుడు కూడా గ్రేప్స్ తీసుకున్నట్టయితే.. శరీరం వెంటనే ఉత్తేజితమయ్యే అవకాశాలు అధికం. 
 
లీచి పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్-సి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి, రోగం తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇన్‌ఫెక్షన్స్, వైరస్‌లతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. అంతేకాదండోయ్.. శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్‌ను సరఫరా చేసి అధిక బరువును కూడా తగ్గిస్తుంది. వేసవిలో పండ్లు, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీర తాపానికి చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అశ్వగంధంతో టీ.. అశ్వగంధం వేర్లను పొడిచేసుకుని పాలలో?