వేసవి కాలంలో శరీరాన్ని మాత్రమే కాదు జుట్టును కూడా చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం. వేసవి కాలం మొదలైందంటే చాలు శరీరంలోని నీరంత ఆవిరైపోతుంది. దాంతో శరీరం పొడిబారుతుంది. రాషెష్ ఏర్పడుతాయి. చిరాకు కలిగిస్తాయి. ఒక్క శరీరానికి మాత్రమే కాదు. కేశాలకు కూడా వేసవి కాలంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతాయి. వేసవి కాలంలో కేశ సంరక్షణకు తీసుకొనే కొన్ని జాగ్రత్తల్లో కొన్నిమెళకువలు తెలుసుకొని ఉండాలి.
అప్పుడు కేశాలతో పాటు మాడును కూడా చల్లగా ఉంచుకోగలుగుతారు. శరీరం కూల్‌గా ఉంచుకోవడానికి సీజన్ బట్టి పండ్లు కూరగాయలు, డ్రింక్స్ ఇలా ఎన్నో మార్పులు చేసుకుంటాం. అయితే కేశ సంరక్షణలో కూడా సరైన ఆహారపు అలవాట్లతో పాటు చల్లని హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం చాలా అవసరం. ఈ సమ్మర్ హెయిర్ ప్యాక్స్‌ను తలకు వాడటం వల్ల తల మాడును వేడి నుండి రక్షించి కూల్‌గా ఉంచుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం!
1. ఒక బౌల్ తీసుకొని అందులో గుడ్డు పగులగొట్టి పసుపుగా ఉన్న సొన మాత్రమే వేయాలి. తర్వాత దానికి 2 చెంచాల తేనె, 2 చెంచాల ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తూ గిలకొట్టాలి. ఇప్పుడు ఈ సమ్మర్ హెయిర్ ప్యాక్‌కు తలకు బాగా పట్టించి 10 నిముషాలు అలాగే ఉంచేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ తలకు చల్లదన్నాన్ని ఇవ్వడంతో పాటు కేశాలు మెరిసేలా చేస్తాయి.
2. కొబ్బరి నూనె రెడ్ వైన్ రెండూ సమానంగా భాగాలుగా తీసుకొని బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఈ సమ్మర్ హెయిర్ ప్యాక్ చిక్కగా లేకపోయినా తలకు పట్టించడం వల్ల కారిపోతుంది. కాబట్టి ఒకటికి రెండు సార్లు హెయిర్‌కు ప్యాక్ వేసి షవర్ క్యాప్‌ను ధరించాలి. 10 నిముషాల తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ వల్ల తల చాలా కూల్‌గా విశ్రాంతి పొందుతుంది.