Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిగ్గీ రాజా 'లవ్ మీటర్' తిరుగుతూనే ఉంది... డిగ్గీ ప్రేమ కోసమే అమృత... ఎంత ఘాటు ప్రేమయో....

ప్రేమ ఎలా పుడుతుందో... ఎందుకు పుడుతుందో... ఎవ్వరికీ తెలీదు. ఒక్కసారి కనుక ఒకరిపై ప్రేమ పుట్టిందో అది ఇక చచ్చేంత వరకూ వదలదు. అదే ప్రేమంటే. ప్రేమకు పేద, ఉన్నత వర్గాలే కాదు భాష కూడా అడ్డు రాదు. అంతేకాదు... వయసు కూడా రానేరాదని చాలా ఉదంతాలే తెలిపాయి. గత ఏ

Advertiesment
Digvijay Singh's wife Amrita Rai Love Life
, బుధవారం, 27 ఏప్రియల్ 2016 (16:33 IST)
ప్రేమ ఎలా పుడుతుందో... ఎందుకు పుడుతుందో... ఎవ్వరికీ తెలీదు. ఒక్కసారి కనుక ఒకరిపై ప్రేమ పుట్టిందో అది ఇక చచ్చేంత వరకూ వదలదు. అదే ప్రేమంటే. ప్రేమకు పేద, ఉన్నత వర్గాలే కాదు భాష కూడా అడ్డు రాదు. అంతేకాదు... వయసు కూడా రానేరాదని చాలా ఉదంతాలే తెలిపాయి. గత ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌ను పెళ్లాడిన యాంకర్ కమ్ జర్నలిస్టు అమృతా రాయ్ తను డిగ్గీని పెళ్లి చేసుకున్న కారణాన్ని తన ఫేస్ బుక్కులో ఉటంకించింది. ఇది అందరూ అప్పట్లో చదివేసే ఉంటారనుకోండి. ఐతే ఆమె సందేశం మాత్రం మళ్లీమళ్లీ నెటిజన్లు చదువుకుంటున్నారు. ఇంతకీ అందులో ఏముంది...?
 
" మా మధ్య ఉన్న వయసు తేడా గురించి అంతా ప్రశ్నార్థకంగా చూడవచ్చు. ఐతే నాకు ఏం కావాలో, నా జీవితం ఎలా ఉండాలన్నది నిర్ణయం తీసుకోడం పూర్తిగా నా చేతుల్లోనే ఉంది. అందుకే ఆయనతో కలిసి కొత్త లోకంలో విహరించదలిచాను. నా జీవితం నాకు ఇచ్చిన స్వేచ్ఛా స్వతంత్రాలకు అనుగుణంగా నేను మలుచుకుని జీవించదలిచాను. కేవలం ప్రేమ కోసమే దిగ్విజయ్ సింగ్ ను పెళ్లాడాను. అంతేకాదు... ఆయనకున్న యావదాస్తిని తన కుమారుడు, కుమార్తెలకు రాసేయాల్సిందిగా కోరాను కూడా. నాక్కావలసింది ఆయన ప్రేమ మాత్రమే. ఆయనతో నడిచే కొత్త జీవితం నాకు ఎంతో తృప్తినిస్తుంది" అంటూ పేర్కొంది. 
 
69 ఏళ్ల దిగ్విజయ్ సింగ్ భార్య ఆషా 2013లో చనిపోయారు. ఆమె మరణానంతరం తనకు టెలివిజన్ జర్నలిస్ట్ అమృతా రాయ్ తో రిలేషన్ ఉన్నట్లు డిగ్గీ ట్విట్టర్లో చెప్పుకున్నారు. అమృత వయసు 44 ఏళ్లు. కాబట్టి ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఈ జంటను చూస్తే మరోసారి నిరూపితమైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవిలో చర్మ సంరక్షణ ఇంట్లోనే సాధ్యం.. ఎలాగంటే?