చెరకు రసంలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. శరీరంలో అధిక బరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను ఈ రసం తగ్గించగలదు. బరువు తగ్గాలనుకునే వారికి చెరుకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. చెరుకులో క్యాల్షియం ఉండటంతో అది ఎముకలు దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చిన్నపిల్లల ఎదుగుదలకు చెరుకురసం చక్కగా దోహదపడుతుంది. క్రోమియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువగా వుంటాయి. అంతేకాకుండా ఐరన్, ఫోలిక్ యాసిడ్‌లు ఎక్కువగా వున్న చెరకు రసం బాలింతలు తీసుకోవడం వలన మంచి ఫలితం వుంటుంది.
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. ఈ చెరకు రసం పిల్లల్లో తరచూ వచ్చే చిన్న చిన్న అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేగాకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.