ఆరోగ్యంపై ప్లాస్టిక్ హానికర ప్రభావం చూపిస్తోందని వైద్యులు చెపుతున్నారు. అందువల్ల జూలై 1 నుంచి దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని అంటున్నారు. దేశంలో వ్యర్థ కాలుష్యానికి అతిపెద్ద వనరుగా ప్లాస్టిక్ మారింది. దేశంలో ఏటా దాదాపు 14 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వాడుతున్నారని, దీని కారణంగా వ్యర్థాలు పెద్దఎత్తున వ్యాపిస్తున్నాయని అంచనా. ప్రజల ఆరోగ్యానికి ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం. ప్లాస్టిక్ కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.
ప్లాస్టిక్ మన ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావితం చేస్తుంది. ప్లాస్టిక్ శతాబ్దాలుగా కుళ్ళిపోదు. ఇది నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, నేల కాలుష్యానికి కారణమవుతుంది. దీంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ సముద్రంలోకి చేరుతుంది. సముద్ర జంతువులు ప్లాస్టిక్‌ను మింగేస్తాయి. సముద్రం నుండి తీసిన చేపలు, ఇతర మత్స్య సంపదను తినడం వల్ల ప్లాస్టిక్ ముక్కలు మానవుల కడుపులోకి చేరి పేగులలో అడ్డంకులు ఏర్పడతాయి.
ఆహార పదార్థాల ప్యాకేజింగ్‌లో ప్లాస్టక్ వల్ల చాలాసార్లు రసాయనాలు ఉపయోగించబడతాయి. దీని కారణంగా ప్రజల రోగనిరోధక శక్తి తీవ్రంగా ప్రభావితమవుతుంది. ప్రజలందరూ ప్లాస్టిక్ కవర్లు లేదా పాత్రలలో ఆహార పదార్థాలను ప్యాక్ చేయడం మానుకోవాలి. ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా వెదురు లేదా గాజు సీసాలను నీటి కోసం ఉపయోగించాలి.