Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

ఉప్పుతో ఆరోగ్యం ఎలా?

Advertiesment
salt
, శనివారం, 7 మార్చి 2020 (19:05 IST)
ఉప్పులో వేడి చేసే స్వభావం ఉంది. దీన్ని ఆహారంలో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని అధిక కఫం తగ్గిపోతుందట. మలమూత్రాలు సాఫీగా బయటికి వెలువడతాయట. పరిమితమైన ఉప్పు సేవిస్తే ఎముకలు దృఢంగా ఉంటాయట.
 
ఉప్పుతోనే సమస్త వ్యాధులూ నయం చేయగల విధానాలు ఎన్నో ఉన్నాయి. ఆయుర్వేదంలో ప్రముఖ పాత్ర వహిస్తోంది ఉప్పు. మన శరీరంలోని రక్తంలో ఉప్పు పదార్థం ఉంటుంది. శరీరంలోని 7 ధాతువులూ సక్రమ పరిణామానికి ఉప్పు ఆయా పదార్థాలను పోషిస్తూ మిగిలిన విసర్జకాలను బైటికి నెట్టేస్తుందట. 
 
అలాగే శరీరంలో ఉండాల్సిన ఉప్పు లేనట్లయితే జీర్ణక్రియ స్థంభించి వ్యాధులు చోటుచేసుకుంటాయి. కాబట్టి శరీర పోషణకు ఉప్పు ఎంతో అవసరం. అంతేకాదు ప్రతి పదార్థంలోను మంచి చెడులున్నట్లు ఉప్పు అధికంగా వాడితే రక్తం పలుచనై ఉబ్బు రోగాలు సంభవిస్తాయట. కాబట్టి అతి సర్వత్రా వర్జయేత్ అని గుర్తించుకోవాలి.
 
ఒక గ్లాసు మంచినీళ్ళు.. ఒక చెంచాడు సోడా ఉప్పు కలిపి తాగితే కడుపు నొప్పి వెంటనే తగ్గుతుంది. ఉప్పు..శొంఠి సమ భాగాలుగా తీసుకుని దోరగా వేయించి దంచి పొడి చేసి భోజన సమయంలో మొదటి ముద్దకు ఈ పొడిని కలిపి తింటుంటే ఆకలి పెరిగి ఆహారం బాగా జీర్ణమై వంటపడుతుంది. 
 
రాళ్ళ ఉప్పును వేయించి మూటకట్టి దానితో కాపడం పెడితే వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. అలాగే సైంధవ లవణం.. పుదీనా ఆకు కలిపి చూర్ణం చేసి నిల్వ చేసుకోవాలి. దాన్ని రోజూ రెండు పూటలా ఆహారం తరువాత 2.3 గ్రాములు పొడిని నీళ్ళతో సేవిస్తుంటే కడుపుబ్బరం, పులిత్రేన్పులు, అజీర్ణం హరించుకుపోతాయట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాప్సికం తింటే కొవ్వు కరుగుతుందా?