Publish Date: Thu, 25 Feb 2021 (17:40 IST)
Updated Date: Thu, 25 Feb 2021 (17:42 IST)
తల్లి తీర్చలేనిది కూడా ఉల్లి తీర్చుతుందని పెద్దలు అంటుంటారు. అంతటి శక్తి ఉల్లిపాయలది. ఈ ఉల్లిపాయలను వారానికి ఒకటి నుండి ఏడింటిని తినడం వల్ల కొలొరెక్టల్, స్వరపేటిక, అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఉల్లిపాయలు తినడం వల్ల నోటి, అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది ఉల్లిపాయలు తినడం ద్వారా జరిగే మంచి. ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి.
ఐతే ఇవే ఉల్లిపాయలు కొందరికి సరిపడవు. ఉల్లిపాయలను అధిక మోతాదులో తినడం వల్ల సున్నితమైన జి.ఐ. ట్రాక్ట్స్ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి పరిస్థితులు ఉన్నవారికి జీర్ణశయాంతర బాధ కలుగుతుంది. దీని ఫలితంగా గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కనుక తగు మోతాదులో ఉల్లిపాయలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది వుండదు.