Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హృద్రోగాలను దూరం చేసుకోవాలంటే? చేపలు తినండి..

వారానికి రెండు లేదా మూడుసార్లు చేపలను తినడం ద్వారా గుండెను పదిలం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజూ ఒక చేప ముక్కను డైట్‌లో చేర్చుకుంటే అందులో వుండే ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ హృద్రోగాలను దూరం చ

Advertiesment
Omega-3
, సోమవారం, 16 అక్టోబరు 2017 (09:46 IST)
వారానికి రెండు లేదా మూడుసార్లు చేపలను తినడం ద్వారా గుండెను పదిలం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజూ ఒక చేప ముక్కను డైట్‌లో చేర్చుకుంటే అందులో వుండే ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ హృద్రోగాలను దూరం చేస్తాయి. వీటిద్వారా శరీరంలోని ట్రై-గిసరైడ్‌లను 15 నుండి 30 శాతం వరకు తగ్గిస్తాయి. ట్రై-గిసరైడ్స్ అనేవి రక్తంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థాలు. వీటిని చేప నూనెలో ఉండే ఒమేగా-ఫాటీ ఆసిడ్‌లు తగ్గిస్తాయి. 
 
అంతేకాకుండా ఇవి ధమనులలో ఏర్పడే ఫలకాలను నెమ్మదిగా ఏర్పరుస్తాయి. ఈ ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ శరీర రక్తంలోని ట్రై-గిసరైడ్‌లను తగ్గించటమే కాకుండా, రక్తపీడనాన్ని, రక్తం గడ్డకట్టడం, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యంగా వుండాలంటే.. మంచి నీటిలో పెరిగే చేపల కంటే ఉప్పు నీటిలో పెరిగే చేపలను తినాలి. ఎందుకంటే ఉప్పు నీళ్లలో పెరిగే చేపలలో ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్‌ వుంటాయి. సాల్మన్, ట్యునా వంటి చేపలు ఉప్పు నీటిలో పెరుగుతాయి. కాబట్టి ఇవి ఆరోగ్యానికి, గుండెకు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
యుక్త వయసులో ఉన్న వారు వారానికి కనీసం రెండు సార్లు అయిన చేపలను తినాలి. 12ఏళ్ల లోపు గల పిల్లలకు వారానికి ఓసారి చేపలు తినిపిస్తే చాలు. 30 దాటిన వారు వారానికి రెండు సార్లు, 45 దాటిన వారు వారానికి ఓసారి చేపలను డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నల్లటి వలయాలు, మచ్చలు పోవాలంటే.. మిరియాల పొడిని?