Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తితిదే ఆయుర్వేదంలో మందుల్లేవ్‌..!

తిరుపతిని ఆధ్మాత్మిక క్షేత్రంగానే కాక.. విద్యా కేంద్రంగానూ, వైద్య కేంద్రంగగానూ అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్ని ప్రభుత్వ, తితిదే ఆసుపత్రులను అత్యున్నతంగా తీర్చిదిద్

తితిదే ఆయుర్వేదంలో మందుల్లేవ్‌..!
, శుక్రవారం, 6 జనవరి 2017 (14:25 IST)
తిరుపతిని ఆధ్మాత్మిక క్షేత్రంగానే కాక.. విద్యా కేంద్రంగానూ, వైద్య కేంద్రంగగానూ అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్ని ప్రభుత్వ, తితిదే ఆసుపత్రులను అత్యున్నతంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. తిరుపతిని వైద్య కేంద్రంగా అభివృద్ధి చేసే బాధ్యతలను తితిదేకి అప్పగించింది. ఈ క్రమంలోనే బర్డ్ ఆసుపత్రిని రూ.42 కోట్లతో ఆసియాలోనే నెంబర్ -1 అనేలా అభివృద్ధి చేశారు. స్విమ్స్‌నూ అదే తరహాలో తీర్చిదిద్దుతున్నారు. రుయా, ప్రసూతి, చిన్నపిల్లల ఆసుపత్రులపైనా దృష్టి సారించారు. ఇంకా కంటి ఆసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రుల ఏర్పాటుకు తితిదే సన్నాహాలు చేస్తోంది. ఇదంతా బాగానే ఉంది కానీ తితిదే ఆధ్వర్యలోని ఆయుర్వేద ఆసుపత్రి మాత్రం మందుల కొరతతో సతమతమవుతోంది. ఈ పరిస్థితికి ఆసుపత్రి అధికారులే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
ఆయుర్వేద ఆసుపత్రికి రోజూ సగటున 800 మంది దాకా రోగులు వస్తున్నారు. ఇటు ప్రకాశం, అటు కర్నూలు, అనంతపురం.. సుదూర ప్రాంతాల నుంచి కూడా రోగులు ఆయుర్వేద చికిత్స కోసం తిరుపతికి వస్తున్నారు. 240 పడకలున్న ఆసుపత్రిలో ఇన్‌ పేషెంట్‌గా అడ్మిట్‌ చేసుకుని కూడా వైద్యం అందిస్తున్నారు. వైద్యులు 40 మందికి దాకా ఉన్నారు. ఆసుపత్రికి అవసరమైన మందులు తయారు చేయడానికి శ్రీనివాసమంగాపురం వద్ద ప్రత్యేక కేంద్రం కూడా ఉంది. రాను రానూ ఆయుర్వేద ఆసుపత్రికి ఆదరణ పెరుగుతోంది. రోగుల సంఖ్య ఎక్కువవుతోంది. దీనికి తగ్గినట్లు మందులు సిద్ధం చేసుకోవడంలో ఆసుపత్రి అధికారులు విఫలమవుతున్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లోనూ మందుల కొరత తీవ్రంగా ఉంది. 
 
అభయారిష్ట, కరక్కాయతో తయారుచేసే మందు ఇది. ప్రధానంగా శల్యతంత్ర విభాగంలో రోగులకు ఇస్తుంటారు. ఇతర విభాగాల్లోని రోగులకూ ఉపయోగపడుతుంది. దీనికి చాలా డిమాండ్‌ ఉంది. అయితే ఏడాది కాలంగా ఈ మందులు ఆసుపత్రిలో లేదు. తానికాయ, కరక్కాయ, ఉసిరితో తయారుచేసే శూర్ణం.. త్రిఫల శూర్ణం దీనికి డిమాండ్‌ ఉంది. ఇదీ అయిపోయింది. శరీరంపైన గాయాలను మాన్పడానికి రణశోధన తైలం ఉపయోగిస్తారు. ఇదీ లేదు. ఇంకా త్రిఫల గుగ్గులు, కాంచనార గుగ్గులు, అర్షోకుఠారస్‌ వంటి మందులు ఇక్కడ కరువయ్యాయి. మహిళలకు సంబంధించిన ప్రసూతి విభాగంఉంది.
 
అక్కడ కీలకంగా ఉండాల్సిన అశోకారిష్ట, రజప్రవర్తిని వాటి, స్త్రీజన కల్పవల్లి తదితర మందులు ఎప్పుడో నిండుకున్నాయి. పిల్లలకు సంబంధించి కౌమారభృత్యం అనే విభాగం ఉంది. ఇందులో బాలాయాకృత రసాయనం, డయారస్ట్, కార్మినేటో వంటి మందులు ఉండాలి. ఏవీ లేవు. అంతెందుకు కొన్ని రోగాలకు వైద్యం చేయడానికి తేనె అవసరం ఉంటుంది. ఆ తేనె కూడా ఆసుపత్రిలో లేదు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మొత్తంగా 60 శాతం మందులు లేవని వైద్యులు చెబుతున్నారు.
 
ఆయుర్వేద ఆసుపత్రికి అవసరమైన కొన్ని మందులను శ్రీనివాసమంగాపురంలోని తితిదే ఫార్మసీలో తయారవుతాయి. కొన్ని మందులను నేరుగా కంపెనీల నుంచి కొనుగోలు చేస్తారు. తితిదే యేటా ఒకటిన్నర కోటికిపైగా మందుల కోసం కేటాయిస్తోంది. అవసరమైతే ఈ బడ్డెట్‌ను పెంచుతుంది కూడా. ఆసుపత్రికి ఏమేరకు మందులు కావాలి అనేది సంబంధిత అధికారులు, వైద్యులు యాజమాన్యానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. ఇక్కడ పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా మందులు తెప్పించుకోవడంలో ఆసుపత్రి అధికారులు విఫలమవుతున్నారు. 
 
కొన్ని మందులు వచ్చిన నెలరోజుల్లోనే అయిపోతున్నాయి. ఆయుర్వేద ఆసుపత్రిలో మందుల కొరతకు ప్రధాన కారణం. తితిదే నిధులు ఇవ్వకపోవడమో.. సహకరించకపోవడమో కాదు. ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు మా దగ్గర మందులు లేవంటూ తమకు తెలిసిన ఆయుర్వేద మందుల షాపుల పేర్లను రోగులకు చెప్పి పంపిస్తున్నారు. ఇప్పటికైనా తితిదే అధికారులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడుపు రేజర్‌ బ్లేడ్‌లను కరిగిస్తుంది.. గుండెపోటు మరణాలు సోమవారమే ఎక్కువ!