Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కడుపు రేజర్‌ బ్లేడ్‌లను కరిగిస్తుంది.. గుండెపోటు మరణాలు సోమవారమే ఎక్కువ!

మానవ శరీరంలో అదిరిపోయే విషయాలున్నాయి. మన కడుపులో ఉండే ఆమ్లాలు రేజర్‌ బ్లేడ్‌లను కూడా కరిగిస్తాయట. మనం రోజుకి సగటున 40 నుంచి 100 వెంట్రుకలను కోల్పోతున్నాం. మన ఒక్కో వెంట్రుక మూడు నుంచి 7 సంవత్సరాల వరకు

Advertiesment
కడుపు రేజర్‌ బ్లేడ్‌లను కరిగిస్తుంది.. గుండెపోటు మరణాలు సోమవారమే ఎక్కువ!
, శుక్రవారం, 6 జనవరి 2017 (14:14 IST)
మానవ శరీరంలో అదిరిపోయే విషయాలున్నాయి. మన కడుపులో ఉండే ఆమ్లాలు రేజర్‌ బ్లేడ్‌లను కూడా కరిగిస్తాయట. మనం రోజుకి సగటున 40 నుంచి 100 వెంట్రుకలను కోల్పోతున్నాం. మన ఒక్కో వెంట్రుక మూడు నుంచి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి. తరువాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయి.
 
ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది. రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఒక సాధారణ ట్రక్‌‌ని 30 కిలోమీటర్ల మేరకు నడిపించవచ్చు. 90శాతంకి పైగా జబ్బులు స్ట్రెస్‌ వల్లనే అని తేలింది. శరీరం నుంచి తలవేరు చేసినా తల 15 సెకన్ల వరకు స్పృహ కోల్పోదు. మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటే మీకు పీడకలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.
 
నిద్రించే సమయంలో మనకు వాసన పీల్చే స్వభావం పనిచేయదు. మానవ శరీరంలో ఉన్న డిఎన్‌ఎ మరియు అరటిపండులో ఉన్న డిఎన్‌ఎ 50శాతం కలుస్తాయి. మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయ పడతాయో చనిపోయిన 3 రోజులకి అవే మనల్ని తినడం మొదలుపెడతాయి.
 
గుండెపోటు వల్ల చనిపోయే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారు. 7 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే త్వరగా చనిపోతారు. వేలి ముద్రలు ఉన్నట్టే. నాలుక ముద్రలు కూడా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి. ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే 576మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది. మనిషి కన్నుని తయ్యారు చెయ్యాలంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చవుతుందట.
 
మన నోరు 100కోట్లకుపైగా రుచులను గుర్తించగలదు. 60 యేళ్ళు వచ్చేసరికి నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ సగానికిపైగా చనిపోతాయి. ఎంత ఎక్కువ ఐక్యూ ఉంటే అన్ని కలలుగంటారు. మన కాళ్ళ గోర్లకన్నా చేతిగోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి. చింపాజీ శరీరంపై ఉన్నన్ని వెంట్రుకలే మన శరీరంపై కూడా ఉంటాయి. కాకపోతే మనవి చాలా సన్నగా ఉంటాయి.
 
మన శరీరం 30 నిమిషాల్లో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు. మన చర్మం నిమిషానికి 50వేల సెల్స్‌ని వదిలేస్తుంది. అంటే జీవిత కాలంలో అది 18కిలోలన్నమాట. మీ బెడ్‌పై ఉండే దుమ్ములో సగానికి పైగా మీ చర్మందే. మన బ్రెయిన్‌ 25వాట్స్ విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవనర్‌తో ఒక బుల్స్ ని వేలిగించవచ్చు. మీకు 40యేళ్ళు వచ్చే వరకు మీరు ఎదురుతూనే ఉంటారు. మన బ్రెయిన్‌ పగటి పూట కన్నా రాత్రి పూటనే చురుకుగా పనిచేస్తుంది. ఒక సంవత్సరంలో 15 వేల కలలుగంటారట. మీరు వింటున్న మ్యూజిక్‌కి తగ్గట్టుగా మీ గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మగాళ్లూ... సంతాన యోగ్యతకు పనికొస్తారా? లేదా? ఇంట్లోనే పరీక్ష చేసుకోండి!