Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీలకర్ర పొడితో సైనస్ తొలగిపోతుందా? సైనస్ సమస్యకు నేచురల్ టిప్స్!

మారుతున్న వాతావరణంలో ప్రతియొక్కరిని వేధిస్తున్న సమస్య సైనస్. ఈ కాలంలో బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టె సమస్య కూడా ఇదే. దీని వల్ల త‌ల‌నొప్పి, క‌ళ్లు మండడం, దుర‌ద‌, ముక్కు నుండి విపరీతంగా నీరు కారడం, ముక్క‌

Advertiesment
Natural Remedies
మారుతున్న వాతావరణంలో ప్రతియొక్కరిని వేధిస్తున్న సమస్య సైనస్. ఈ కాలంలో బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టె సమస్య కూడా ఇదే. దీని వల్ల త‌ల‌నొప్పి, క‌ళ్లు మండడం, దుర‌ద‌, ముక్కు నుండి విపరీతంగా నీరు కారడం, ముక్క‌ు నొప్పి ఇలా అన్ని సమస్యలు కలుగుతాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా సైన‌స్ స‌మ‌స్య నుంచి తక్షణ ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.... 
 
ఒక టీస్పూన్ వాముని పెనం మీద వేయించి గుడ్డలో కట్టి వాస‌న పీల్చితే  ముక్కు లోపలి రంధ్రాలు బాగా తెరుచుకుంటాయి. ఇలా చేస్తే...త‌ల‌నొప్పి త‌గ్గి ఉప‌శ‌మ‌నం కలుగుతుంది.
 
ఒక టీస్పూన్ జీల‌క‌ర్ర‌ను బాగా వేయించి పొడి చేసి దానిలో తేనె క‌లిపి రోజుకు 2 సార్లు తీసుకుంటే సైన‌స్ నుంచి విముక్తి కలుగుతుంది. ఆహారంలో కారం పొడిని ఎక్కువ‌ శాతం తీసుకుంటే... ముక్కు నుంచి ఎక్కువ‌గా నీరు రాకుండా కాపాడుతుంది.
 
ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. దాంట్లో కొన్ని చుక్క‌ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ వేసి ఆవిరిని పీల్చితే ముక్కులోని రంధ్రాలు తెరుచుకుని గాలి బాగా ఆడుతుంది. స‌మ‌స్యకు పరిష్కారం కలుగుతుంది. నిమ్మ‌, ఉసిరి, కివీ పండ్లను త‌ర‌చూ తీసుకుంటుంటే కూడా సైన‌స్ బారినుండి తప్పించుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందంగా కనిపించేందుకు పోటీపడుతున్న యువత.. బ్యూటీపార్లర్లకు యువకుల క్యూ!