Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేకప్ వేసుకునే ముందు.. క్యారెట్, పన్నీర్, చందనం పొడి ప్యాక్ వేసుకుంటే?

మహిళలూ మేకప్ చెదరకుండా ఉండాలంటే.. ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో అర టీస్పూన్ పన్నీరు, పావు టీస్పూన్ చందనం పొడి చేర్చి ముఖానికి బగా అప్లై చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆపై మేకప్ వేసుకుంటే గంటల

Advertiesment
Make Up
, బుధవారం, 5 అక్టోబరు 2016 (16:56 IST)
మహిళలూ మేకప్ చెదరకుండా ఉండాలంటే.. ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో అర టీస్పూన్ పన్నీరు, పావు టీస్పూన్ చందనం పొడి చేర్చి ముఖానికి బగా అప్లై చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆపై మేకప్ వేసుకుంటే గంటల తరబడి మేకప్ చెదిరిపోకుండా ఉంటుంది. 
 
చర్మం నిగనిగలాడుతూ ఉండేందుకు ఎండబెట్టిన 50 గ్రాముల క్యారెట్ తురుముకు అంతే సమానంగా దోస విత్తనాలు, వంద గ్రాముల పెసరపప్పు, బార్లీలను పొడి చేసుకవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తూ ఉంటే చర్మం మంచి రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. 
 
అలాగే రోజులో కనీసం నాలుగైదుసార్లు చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటూ ఉంటే జిడ్డు సమస్య కొంతవరకు తగ్గుతుంది. జిడ్డు సమస్య ఉన్నవాళ్లు జెల్ ఆధారిత సన్‌స్క్రీన్‌ను ఎంచుకుంటే కొంత మార్పు ఉంటుంది. 
 
బాదంపప్పు, గ్లిజరిన్ సుగుణాలున్న సబ్బుల్ని వాడాలి. వారానికి రెండుసార్లు బత్తాయి, దోస, కీరదోస వంటి వాటితో ముఖాన్ని రుద్దుకోవాలి. దీనివల్ల చర్మంలోని నూనెశాతం అదుపులోకి వచ్చేస్తుంది. ఇక, పెదవులు పొడిబారి ఉంటే మాయిశ్చరైజర్ ఉన్న లిప్‌స్టిక్‌లను ఎంచుకోవాలి. కొందరి పెదవులు సహజంగా ఉంటాయి. అలాంటి వారు డ్రైలిప్‌స్టిక్స్ వేసుకుంటే సరిపోతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింహ వాహనంపై శ్రీవారు... భక్తుడికి సింహబలం ఉంటేనే...(వీడియో)