Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్తమా రోగులు అది చేస్తే చాలు...

Advertiesment
ఆస్తమా రోగులు అది చేస్తే చాలు...
, మంగళవారం, 21 జనవరి 2020 (22:15 IST)
రోజూ కనీసం ఓ అరగంటపాటు హాయిగా నవ్వేవారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని వైద్యులు అంటున్నారు. అంతేకాదు మనసారా నవ్వినప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా ఏవైనా బాధలు ఉన్నట్లయితే వాటికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. 
 
కీళ్లవాపు, కండరాల నొప్పులు, బిగుసుకుపోవటం... వంటి ఇబ్బందులు నవ్వుతో తగ్గిపోతాయి. బాధను తగ్గించే ఎండార్ఫిన్‌లు విడుదలవబట్టే పార్శ్వ నొప్పితో బాధపడేవారికి నవ్వును ఓ చికిత్స విధానంగా నేడు ప్రయోగిస్తున్నారు. ఆస్త్మా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులతో బాధపడేవారికి నవ్వు ఓ మంచి వ్యాయామం. నవ్వువల్ల ఊపిరితిత్తుల బాగా వ్యాకోచిస్తాయి. 
 
రక్తంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఆస్త్మా రోగులకు శ్వాస నాళాల్లో శ్లేష్మం పేరుకుని ఇబ్బంది పెడుతుంది. దానిని బయటకు తెప్పించేందుకు వైద్యులు ఫిజియోథెరపీని సూచిస్తారు. బూరలు ఊదటం వంటివి చేయించటం ద్వారా శ్లేష్మాన్ని బయటకు రప్పిస్తారు. నిజానికి నవ్వు చేసే పని అదే. నవ్వినపుడు శ్వాసకోశాలు విచ్చుకుని శ్లేష్మం బయటకు వస్తుంది. అయితే అతిగా నవ్వినపుడు ఆస్త్మా రోగులకు ఇబ్బంది ఎక్కువ కావచ్చు. ఆ సందర్భంలో తప్పక వైద్యుని సంప్రదించాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈతరం అమ్మాయిలు ఖచ్చితంగా కరివేపాకు పచ్చడి తినాల్సిందే