ప్రయాణం చేసేటప్పుడు చర్మం జాగ్రత్త.. సబ్బు వద్దు ఫేస్ వాష్ ఉపయోగించండి.
ప్రయాణంలో శరీరం అలసటకు లోనవుతుంది. కాలుష్యం, ఎండ తీవ్రత కారణంగా శరీర చర్మం పొడిబారుతుంటుంది. ఇలాంటి సందర్భంలో చర్మకాంతిని మెరుగుపెట్టుకునేందుకుగాను మీకు కొన్ని చిట్కాలు...
ప్రయాణంలో శరీరం అలసటకు లోనవుతుంది. కాలుష్యం, ఎండ తీవ్రత కారణంగా శరీర చర్మం పొడిబారుతుంటుంది. ఇలాంటి సందర్భంలో చర్మకాంతిని మెరుగుపెట్టుకునేందుకుగాను మీకు కొన్ని చిట్కాలు...
మీరు తరచూ ప్రయాణం చేసేవారైతే లేదా ట్రెక్కింగ్ లేదా సముద్రపు ఒడ్డున ప్రయాణం చేసే ప్రణాళికలుంటే కొన్ని సౌందర్య చిట్కాలు పాటించండి. అవేంటంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్‌ను మీ వెంట తీసుకువెళ్ళడం మరవకండి.
* ఎండలో ప్రయాణం చేసే 20 నిమిషాలముందు మీ ముఖానికి, శరీరంపైనున్న చర్మంపై సన్‌స్క్రీన్ లోషన్‌ను అప్లై చేయండి.
* ప్రయాణం చేసేటప్పుడు మీ ముఖాన్ని తరచూ నీటితో కడుగుతుండండి.
* ముఖం కడుక్కునేందుకు సబ్బుకు బదులుగా ఫేస్‌వాష్‌ను వాడుతుంటే చాలా బాగుంటుంది.
* ప్రయాణం చేసే సందర్భంలో మీ శరీర చర్మ సౌందర్యాన్ని కాపాడుకునేందుకుగాను "వాటర్ బేస్‌డ్ మాయిశ్చరైజర్"ను వాడండి. దీంతో మీ చర్మ సౌందర్యం ఏ మాత్రం తగ్గదు.