నాజూగ్గా ఉండాలా.. కాఫీ, టీలను తగ్గించండి.. లెమన్ లేదా గ్రీన్ టీ తాగండి..
నాజూగ్గా ఉండాలని ఏవేవో వ్యాయామాలు, యోగాలు, ఆహార నియమాలు పాటిస్తున్నారా అయితే ఈ కథనం చదవాల్సిందే. స్లిమ్‌గా ఉండాలంటే కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్లు, పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూ
నాజూగ్గా ఉండాలని ఏవేవో వ్యాయామాలు, యోగాలు, ఆహార నియమాలు పాటిస్తున్నారా అయితే ఈ కథనం చదవాల్సిందే. స్లిమ్‌గా ఉండాలంటే కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్లు, పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కాఫీ, టీలను తగ్గించి లెమన్ లేదా గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు.
ఉదయం పూట ఒక గ్లాస్ పాలు తీసుకోవచ్చు. ఇక మధ్యాహ్న భోజన విషయానికి వస్తే రోటీలు, సోయా ఆయిల్‌లో సగం ఉడికిన కూరగాయలు, దాల్, సలాడ్ వంటివి తీసుకోవచ్చు. సాయంత్రం సమయంలో పండ్లు, ఇడ్లీలు, చపాతీలు తీసుకోవడం ద్వారా బరువుతగ్గుతారు.
అలాగే మితమైన చక్కెర కలిపిన టీ, కాఫీ, పాలును కూడా సాయంత్రం పూట తీసుకోవచ్చు. ఇక రాత్రిపూట భోజన విషయానికి వస్తే నిద్రకు ఉపక్రమించేందుకు మూడు గంటల ముందే డిన్నర్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పూట మితమైన ఆహారంతో పాటు సూప్, సలాడ్, రోటీలు తీసుకుంటే తప్పకుండా బరువు తగ్గుతారని వారు చెబుతున్నారు.