గర్భంతో ఉన్నప్పుడు గ్రీన్ టీ తాగొచ్చా? తాగకూడదా? తాగితే ప్రయోజనాలేంటి?
గర్భంగా ఉన్నప్పుడు గ్రీన్ టీ తాగొచ్చా? తాగకూడదా? అనే అనుమానం మీలో ఉందా? అయితే ఈ స్టోరీ చదవండి. గర్భవతులు టీ, కాఫీ, నికోటిన్, కెఫీన్ ఆధారిత ద్రావణాలకు దూరంగా ఉండాల్సిందిగా స్రావాలు అధికమయ్యే అవకాశం ఉంద
గర్భంతో ఉన్నప్పుడు గ్రీన్ టీ తాగొచ్చా? తాగకూడదా? అనే అనుమానం మీలో ఉందా? అయితే ఈ స్టోరీ చదవండి. గర్భవతులు టీ, కాఫీ, నికోటిన్, కెఫీన్ ఆధారిత ద్రావణాలకు దూరంగా ఉండాల్సిందిగా స్రావాలు అధికమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తాడు. కానీ, అరుదుగా లేదా చాలా తక్కువ మంది గ్రీన్ టీ వైపు మొగ్గు చూపుతారు. నిజానికి రోజు టీ లేదా కాఫీ అలవాటున్న వారికి ఇదొక మంచి ప్రత్యమ్నాయమని చెప్పవచ్చు. అయితే గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగడం ద్వారా ఏర్పడే లాభాలేంటో చూద్దాం..
తాజాగా తయారు చేసిన పండ్ల రసాలతో పోలిస్తే, గ్రీన్ టీ తీసుకోవడం అత్యుత్తమం. గ్రీన్ టీ గర్భవతులలో బరువును తగ్గించటమే కాకుండా, శరీరంలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను కూడా స్థిరీకరిస్తుంది. శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను సాధారణ స్థితికి తీసుకొచ్చే ఎపిగాలోక్యాటేచిన్స్ హెర్బల్ టీలలో ఉంటాయి. గర్భవతుల శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల వలన ఇన్సులిన్ స్థాయిలలో హెచ్చు తగ్గులు ఏర్పడతాయి. రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగటం వలన ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
నీటిలో కలిగే విటమిన్ అయినట్టి ఫోలేట్ గ్రీన్ టీలో ఉంది. ఇంకా ఇందులో విటమిన్ బి.. శిశువులో జనన లోపలు కలిగే అవకాశాలను దాదాపు తగ్గించి వేస్తుంది. ఫోలేట్ మాత్రమేకాకుండా, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలకు సహజ మూలాధారంగా గ్రీన్ టీని పేర్కొనవచ్చు. గ్రీన్ టీ గర్భవతుల్లో రోగనిరోధక సామర్థ్యాన్ని, ఆరోగ్యానికి శక్తిని పెంచుతుంది. ఈ గ్రీన్ టీ రోగ నిరోధక సామర్థ్యాన్ని పెంచి, బ్యాక్టీరియాల నుంచి సంరక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.