మహిళలూ.. మీసాలొస్తున్నాయా? శెనగ పిండి-పసుపు పేస్టును రాయండి!
మహిళలూ.. మీసాలొస్తున్నాయా? శెనగ పిండి-పసుపు పేస్టును రాయండి. ఇలా చేస్తే పై పెదవిపై ముక్కుకు కింద ఉండే అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.
మహిళలూ.. మీసాలొస్తున్నాయా? శెనగ పిండి-పసుపు పేస్టును రాయండి. ఇలా చేస్తే పై పెదవిపై ముక్కుకు కింద ఉండే అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.
శెనగ పిండి, పసుపు, పెరుగును పేస్టు చేసి బాగా కలపండి. ఈ పేస్టును పై పెదవుల పైభాగాన పూసి.. 15-20 నిమిషాల పాటు ఉంచి.. ఆపై పూర్తి పొడిగా మారిన తర్వాత నీటితో కడిగేస్తే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.
అలాగే తేనె, రెండు చెంచాల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని నాలుగు రోజుల పాటు పెదవిపై భాగంలో పూస్తే.. ఈ మిశ్రమం వెంట్రుకలను పలుచగా చేసి, అవాంఛిత రోమాలను కనపడకుండా చేస్తాయి.
పెదవిపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించే మరొక శక్తివంతమైన ఔషదం- గుడ్డు తెల్ల సొన. ఒక చెంచా శెనగపిండి, చక్కెరను తీసుకొని కలిపి, వీటన్నిటిని గుడ్డు తెల్ల సొనకు కలపండి. ఈ మిశ్రమం చిక్కగా మారే వరకు బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని పై పెదవి పైభాగాన పూసి, కనీసం 30 నిమిషాల వరకు వేచి ఉండి, తరువాత తొలగించండి. మంచి ఫలితాల కోసం తాజాగా తయారు చేసిన ఈ పేస్ట్‌ను వారానికి రెండు సార్లు వాడండి. ఇలాచేస్తే అవాంఛిత రోమాలు తొలగిపోతాయని న్యూట్రీషన్లు అంటున్నారు.