కాఫీ తాగడం వల్ల నష్టం కంటే లాభమే ఎక్కువంటున్న శాస్త్రవేత్తలు ఎలా?
సాధారణంగా కాఫీ సేవించడం వల్ల వివిధ అనారోగ్యం సమస్యలు కలుగుతాయనే ఓ ప్రచారం వాడుకలో ఉంది. దీనిపై జరిగిన పరిశోధనలు కూడా అలాంటి ఫలితాలనే ఇచ్చాయి.
సాధారణంగా కాఫీ సేవించడం వల్ల వివిధ అనారోగ్యం సమస్యలు కలుగుతాయనే ఓ ప్రచారం వాడుకలో ఉంది. దీనిపై జరిగిన పరిశోధనలు కూడా అలాంటి ఫలితాలనే ఇచ్చాయి. అయితే, యూకేలోని ఉల్‌స్టర్ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో మాత్రం కాఫీ తాగడం వల్ల కలిగే నష్టం కంటే అధిక ప్రయోజనాలే కలుగుతాయని చెపుతున్నారు.
కాఫీ ప్రియులు రోజుకు 3 నుంచి 4 కప్పులు తాగడం ద్వారా వయోజనులకు ముప్పు కలుగడం కంటే ప్రయోజనాలే కలుగుతాయట. కాఫీ సేవించడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, నరాలు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలేమైనా వస్తున్నాయా అనే అంశాలపై లోతైన అధ్యయనం చేశారు. కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి నష్టం కంటే ఎక్కువ ప్రయోజనాలే ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.