Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

ఐస్‌క్రీమ్ తింటే ఏమవుతుందో తెలుసా..?

Advertiesment
ice cream
, శనివారం, 23 ఫిబ్రవరి 2019 (15:49 IST)
ఐస్‌క్రీమ్ మాట వినగానే ఏ వయస్సు వారికైనా నోట్లో నీళ్ళు ఊరుతాయి. వయోబేధం, లింగబేధం లేకుండా అందరూ ఇష్టపడే ఒకే ఒక్క పదార్థం ఐస్‌క్రీమ్ అని చెప్పొచ్చు. అయితే రకరకాల కారణాల వలన కొందరు దీనికి దూరంగా ఉండడమే కాకుండా పిల్లల్ని కూడా దూరంగా ఉంచుతారు. కానీ వారివన్నీ అర్థంలేని భయాలే అంటున్నారు బ్యూటీ నిపుణులు.
 
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కింద ఐస్‌క్రీం తీసుకుంటే రోజంతా చురుకుగా ఉండవచ్చు అన్న విషయం వీరి పరిశోధనలో వెల్లడైంది. సుమారు రెండువేల మందిపై పరిశోధన చేశారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కింద ఐస్‌క్రీమ్ ఇచ్చారు. మరో గ్రూపు వారికి వారు రోజూ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ను అందించారు. అనంతరం వారికి కొన్ని పజిల్స్ ఇచ్చి పూర్తి చేయమన్నారు.
 
ఐస్‌క్రీమ్ తిన్న గ్రూపులో 60 నుండి 70 శాతం మంది చాలా త్వరగా పజిల్‌ను ఈజీగా పూర్తిచేయగా, రెండోగ్రూపు వారు దాన్ని పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. ఈ వ్యత్యాసానికి కారణం బ్రేక్‌ఫాస్ట్ కింద ఐస్‌క్రీమ్ తీసుకోవడమే అని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ విషయం మీద మరిన్ని పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్సర్ వ్యాధికి ఎలాంటి చికిత్సలు చేయాలి..?