నేటి తరుణంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. రోజూ నిద్రపోతున్నారో లేదో కానీ ఈ మీడియాలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. అదేపనిగా సోషల్ మీడియాను ఫాలో చేయడం వలన పలురకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఇటీవలే ఓ అధ్యయనంలో వెల్లడించారు. ఈ సమస్యలు పురుషులకంటే.. స్త్రీలకే ఎక్కువగా ఉన్నాయని కూడా తెలియజేశారు.
సోషల్ మీడియాను ఫాలో చేయడం మంచిదే. అందుకని.. అదేపనిగా ఎప్పుడూ చూసినా దాంట్లోనే మునిగిపోవడం మంచికాందంటున్నారు సైంటిస్టులు. సోషల్ మీడియా ఫాలో చేసే పురుషులకంటే.. స్త్రీలే అధికంగా ఉన్నారు. దీని కారణంగా స్త్రీలు డిప్రెషన్‌కి గురికావలసి వస్తుందని అధ్యయంలో స్పష్టం చేశారు.
వీటి వివరాల్లోకి వెళ్తే.. ఆడిపిల్లల్లో 40 శాంతి మంది మగపిల్లల్లో 28 శాతం మంది డిప్రెషన్‌కు లోనయినట్లు గుర్తించారు వైద్యులు. రోజుకు 5 గంటల వ్యవధిలో మాత్రలే సోషల్ మీడియా ఫాలో చేయాలంటున్నారు. ఒకవేళ ఈ 5 గంటలకన్నా మించితే స్త్రీలు రకరకాల డిప్రెషన్ స్థాయికి లోనై దానిలోనే ఉండాలనే ఆలోచన ఎక్కువై.. పిచ్చపట్టేలా చేస్తుందని అధ్యయంలో స్పష్టం చేశారు.