ప్రస్తుతం చాలామంది డైనింగ్ టేబుల్‌పై భోజనం చేస్తుంటారు. అయితే ఇది ఆరోగ్యరీత్యా సరైనా విధానం కాదని వైద్యులు చెబుతుంటారు. పాతకాలంలో నేలమీద కూర్చుని భోజనం చేసే సంప్రదాయం ఉండేది. ఇలా చేయడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. నేలపై కూర్చుని భోజనం చేసే సమయంలో మనం సుఖాసనంలో కూర్చోవలసి వస్తుంది.
సుఖాసనం అనేది పద్మాసనం లాంటిదే. పద్మాసనం కారణంగా శరీరానికి ఏ ప్రయోజనాలు చేకూరుతాయో, సుఖాసనంలో కూడా అవే ప్రయోజనాలుంటాయి. కూర్చుని తినడం వలన ఆహారాన్ని చక్కగా స్వీకరించగలుగుతాం. ఈ ఆసనం ఏకాగ్రతను కూడా ప్రసాదిస్తుంది.
రక్తప్రసరణ దేహమంతటా సమాన రీతిలో ఉండేలా చేస్తుంది. తద్వారా శరీరానికి అదనపు శక్తి లభిస్తుంది. ఈ విధంగా భోజనం చేయడం వలన అధిక బరువు, మలబద్ధకం, గ్యాస్ తదితర ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. ఈ ఆసనంలో కూర్చోవడం వలన నడుమునొప్పి నుండి విముక్తి లభిస్తుంది.
కనుక ప్రతిరోజూ చేసే భోజనం ఒంటికి పట్టాలంటే.. నేలమీద కూర్చుని తినండి. అదే ఆరోగ్యానికి మంచిదంటున్నారు వైద్యులు. ఇలా నేలమీద కూర్చుని తినడం వలన జీర్ణక్రియలు కూడా సక్రమంగా జరుగుతాయి.