టాబ్లెట్లు ఎలా వేసుకోవాలి? మాత్ర చేదుగా వుందనీ...
సాధారణ జబ్బులకు సైతం వైద్యులు మాత్రలు రాసివ్వటం అతి సహజం. అయితే మాత్రలు మింగటానికి మనం వాడుతున్న ద్రవపదార్ధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని వైద్యులు చెపుతున్నారు. మాత్రలు మింగేందుకు తొలి నుంచి
Publish Date: Fri, 07 Jul 2017 (14:52 IST)
Updated Date: Fri, 07 Jul 2017 (14:54 IST)
సాధారణ జబ్బులకు సైతం వైద్యులు మాత్రలు రాసివ్వటం అతి సహజం. అయితే మాత్రలు మింగటానికి మనం వాడుతున్న ద్రవపదార్ధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని వైద్యులు చెపుతున్నారు. మాత్రలు మింగేందుకు తొలి నుంచి చేసుకున్న అలవాట్లు రీత్యా కాఫీ, టీ, పాలు, పళ్ళరసాలు లేదా నీళ్ళు వాడుతుంటారు. అయితే వీటన్నింటిల్లో నీళ్ళతో మాత్రం తీసుకోవడం క్షేమకరమని డాక్టర్లు చెబుతున్నారు. నీళ్ళు కాక ఇతర ద్రవపదార్ధాలు వాడటం మాత్రలు చేసే ప్రక్రియ భంగం కలిగిస్తాయని వారు చెపుతున్నారు.
కాఫీ, టీలతో మాత్రల్ని తీసుకుంటే పలు సమస్యలను మనకు మనమే ఆహ్వానించినట్లు అవుతుందంటున్నారు. ఎందుకంటే ఉబ్బసం వంటి వాటికి వాడే మందుల గుణాన్ని కాఫీలోని కెఫీన్ దెబ్బతీస్తుంది. పైగా సైడ్ ఎఫెక్టులు అధికం కావచ్చు. అంతేకాదు కెఫీన్ కడుపులో మంటను పెంచుతుంది. పాలల్లోని కాల్షియం యాంటీబయోటీస్ మందుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది.
మామిడిపండు పీచుతో కూడిన పళ్ళరసాలు, లేదా కాయగూరల రసాలతో మాత్రలు తీసుకుంటే కొన్ని మందుల ప్రభావం తగ్గిపోతుంది. ద్రాక్షరసం తీసుకుంటే అందులోని ఎంజైమ్స్‌లు కొన్ని మాత్రల ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. గుండె జబ్బులకు ఉపయోగించే కొన్ని రకాల మందులు, యాంటీ ఫంగల్ మందులు పనిచేయక పోగా సైడ్ ఎఫెక్టులకు దారి తీయొచ్చని చెపుతున్నారు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories....
Read More