గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే.. నడుం నొప్పి మటాష్!
ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వల్ల చిన్న వయస్సులోనే నడుము నొప్పి వస్తోంది. నడుము నొప్పి సమస్యతో
Publish Date: Sat, 13 Aug 2016 (11:11 IST)
Updated Date: Sat, 13 Aug 2016 (11:37 IST)
ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వల్ల చిన్న వయస్సులోనే నడుము నొప్పి వస్తోంది. నడుము నొప్పి సమస్యతో సతమతమయ్యేవారు కొన్ని తేలికపాటి చిట్కాలు పాటించడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.
ప్రతి రోజూ వెల్లుల్లి రసాన్ని పావు గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే నడుం నొప్పినుండి విముక్తి కలుగుతుంది. అల్లం రసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే జీర్ణకోశం బాగుపడి నడుంనొప్పి కూడా తగ్గుతుంది. ఆవనూనె, నువ్వుల నూనె కొద్దిగా వేడి చేసి నడుము చుట్టూ మర్దన చేసుకుని వేడినీళ్ళతో స్నానం చేస్తే నడుం నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే కూడా నొప్పి తగ్గుతుంది.