Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లి పాలను పెంచుకోవడం ఎలా?

తల్లి పాలను పెంచుకోవడం ఎలా?
, సోమవారం, 23 ఆగస్టు 2021 (12:36 IST)
మాతృత్వం మహిళకు దేవుడిచ్చిన వరం. మాతృమూర్తిగా మారాకే స్త్రీ పరిపూర్ణతను సంతరించుకుంటుంది. అమ్మ పాలు అమృతం . బిడ్డ పుట్టిన తర్వాత కనీసం ఆరు మాసాలైన తల్లి పాపాయికి పాలివ్వాలి.
 
తల్లి పాలు ప్రకృతి ప్రసాదం. దివ్యౌషధం. పాపాయికి పాలు ఇస్తే తల్లి ప్రసవానంతర తర్వాత వచ్చిన బరువు తగ్గటానికి దోహదపడుతుంది. గర్భాశయం యధాస్థానంలోకి వస్తుంది. రక్తస్రావం తగ్గుతుంది. రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లాంటి అనారోగ్యాలు రావు.

తల్లి పాపాయికి పాలు ఎంతకాలం ఇస్తే, ఇద్దరికీ అంత మంచిది. పాపాయికి సమతుల ఆహారం లభిస్తుంది. తల్లి పాలు తాగే పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, చెవి సమస్యలు మొదలగునవి రావు. పెద్ద వయసులో అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధులను రాకుండా కాపాడుతుంది.
 
తల్లి పాలు పెరగాలంటే... ఇలా చేయాలి... 
తల్లి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండి పాపాయిని గురించి ఆలోచించాలి. బాగా ఎక్కువగా నిద్రపోవాలి. పాపాయికి పాలు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఉత్పత్తి జరుగుతుంది.
 
 
"ఆహార నియమాలు": ముడి బియ్యం వాడాలి. చక్కగా ఉడికిన అన్నం, తేలిగ్గా జీర్ణమయ్యే ఆకు కూరలు, పళ్ళ రసాలను తీసుకోవాలి. ఆయా కాలాల్లో వచ్చే పండ్లను తీసుకోవాలి.
 
ఎక్కువ కారం, పులుపు పదార్ధాలు, చల్లగా ఉండే పానీయాలు వంటివి తీసుకోకూడదు.సులువుగా జీర్ణం కాని పదార్ధాలను తీసుకోకూడదు. బాలింతలకు మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది. మెంతులతో చేసిన పదార్ధాలను తినిపించాలి.
 
వెల్లుల్లిని పచ్చివిగా తినడం కంటే, పొడులలో చేర్చి ఇవ్వడం మంచిది. కాకర కాయను ప్రసవం తర్వాత తీసుకోవడం వలన పాలు బాగా పడ‌తాయి.
 
బొప్పాయి:
బొప్పాయి కల్ప తరువు. దోరగా ఉన్న బొప్పాయిని కోరులా చేసి కూర వండుకొని తిన్నట్లయితే స్తన్య వృద్ధి జరుగుతుంది.
 
గమనిక' :
తల్లి పాలు దోషయుక్తంగా ఉండి, బిడ్డకు వికారం, విరేచనాలు కల్గిస్తున్నపుడు, బొప్పాయి పండుని తీసుకోవడం మంచిది. తులసి ఆకులతో తేనె కలిపి తినడం వలన కూడా తల్లి పాలు బాగా ఉత్పత్తి అవుతాయి.
 
గ్రీన్ వెజిటబుల్స్, రెడ్ వెజిటేబుల్స్‌లలో ఎక్కువ ఫైబర్ వుంటాయి. ఇవి తల్లి పాలను పెంచడంలో సహకరిస్తాయి. ఆకు కూరలు, బీన్స్, స్వీట్ పొటాటొ మరియు దుంపలు పాలను పెంచడంలో చాలా ఉపయోగపడతాయి. నల్ల ద్రాక్ష, కర్బూజ పండ్లు కూడా మంచివి. పాలకూర, జీలకర్ర, బార్లీ జావ, బొబ్బర్లు, ములగాకు మొదలగునవి చాలా మేలు చేస్తాయి.
 
ఇలా చేయండి... తల్లి పాలు పెరుగుతాయి.
 
1. మెంతులు:
రాత్రి 1 టీస్పూన్ మెంతులను 1  గ్లాసు నీళ్ళలో నానబెట్టండి. 
ఉదయం మెంతులను ఆ నీళ్ళలోనే మరిగించండి. మెంతులను వడబోసి ఆ నీళ్ళను మాత్రమే త్రాగండి. ప్రతి రోజు ఉదయం త్రాగండి. త్వరలో ఫలితం లభిస్తుంది.
 
2.  సోంపు గింజలు:
ఒక టీ స్పూను సోంపు గింజలు + 1 గ్లాసు వేడి నీళ్ళలో వేసి , 1/2 గంట వరకు వుంచాలి. సోంపు గింజలను వడబోసి తాగాలి. ఆ విధంగా ఉదయం, రాత్రి తాగాలి. 1 నెల రోజులు తాగాలి.
 
3. తావరి (పిల్లపెసర గడ్డలు:
2 లేక 3 టీస్పూనుల శతావరి పోడి + 1 గ్లాసు వేడి ఆవు పాలు + చిటికెడు పిపిళ్ళ చూర్ణం ని కలిపి తాగండి.
 
4 . జీలకర్ర:
2 గ్రాముల జీల‌కర్ర పొడి + 1 టేబుల్ స్పూను దేశీయ ఆవు నెయ్యిలో కలిపి తీసుకొండి.
 
5. 'శొంఠి + బెల్లం:
2 గ్రాముల సొంఠి పొడి + 4 గ్రాముల బెల్లంను కలిపి రెండు భాగాలుగా చేసుకొని , ఉదయం, రాత్రి తీసుకోండి.
 
6.దాల్చిన చెక్క పొడి :
రాత్రి భోజనము తర్వాత 1 టీ స్పూను దాల్చిన చెక్క పొడి+తేనెను కలిపి తినండి. తర్వాత వేడి పాలు త్రాగండి.
 
7.బీట్ రూట్ + క్యారట్:
జ్యూసులను సమపాళ్ళలో కలపండి. కొద్దిగా తేనె కలిపి తాగండి.
 
8. పాలు పడని బాలింతలు రాగిజావ త్రాగితే క్రమంగా పాల ఉత్పత్తి పెరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెరుగుతో పాటు సోంపు పొడిని కలిపి తీసుకుంటే?