Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బరువు తగ్గాలి... ఏం తినాలి? ఎలా తినాలి?

బరువు తగ్గాలి... ఏం తినాలి? ఎలా తినాలి?
, సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (22:00 IST)
ఇటీవలకాలంలో  సమయానికి భోజనం చేయకపోవడం యుక్త వయసు వారిలో ఉండే ప్రధాన సమస్య. ఉదయం టిఫిన్ మొదలుకొని రాత్రి భోజనం వరకు ఏదీ సమయానికి తీసుకోరు. ఇలాంటివారు ఒకేసారి ఆకలితో హెవీ మీల్స్ చేయడం వల్ల అధిక బరువు పెరుగుతారు. వీరు చాలా జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించాలి. బ్రేక్ ఫాస్ట్ పూర్తయిన రెండు మూడు గంటల తరువాత స్నాక్స్ రూపంలో తాజా పండ్లను తీసుకోవాలి. దీంతో కావాల్సినన్ని క్యాలరీలు లభిస్తాయి. కడుపు నిండినట్లు ఉంటుంది.
 
మధ్యాహ్న భోజనం తరువాత కూడ ఇదే చేయాలి. మొలకెత్తిన విత్తనాలు, ఫ్యాట్ తక్కువగా ఉండే మజ్జిగ, ఇతర మిల్క్‌షేక్స్, ఫ్లేవర్ మిల్క్‌లాంటివి తీసుకోవాలి. సాధారణంగా మహిళలు 30 ఏళ్లు, పురుషులు 35 ఏళ్లు దాటిన తరువాత బరువు పెరగడం మొదలవుతుంది. అది ఊబకాయానికి దారి తీయవచ్చు. క్రమేణా రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి సమయంలోనే తినే ఆహార పదార్ధాలను నియంత్రించుకోవాలి. బ్యాలెన్స్ తప్పితే అధిక బరువుతో బాధపడాల్సి వస్తుంది. బరువులేని వారు తగినంత బరువు పెరగాలంటే, మధ్యాహ్న భోజనంతో పాటు పాప్‌కార్న్, మరమరాలు, కొవ్వు పరిమాణం తక్కువగా ఉండే స్నాక్స్ తీసుకోవాలి. 
 
వయసుపెరిగే కొద్దీ శారీరక శ్రమ తగ్గుతుంది. రక్తపోటు, షుగర్ వ్యాధి వంటివి వచ్చే అవకాశం వుంటుంది. దీంతో జీర్ణశక్తి గణనీయంగా పడిపోతుంది. ఇటువంటి సమయంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ సాయంకాలాలు తీసుకోవాలి స్నాక్స్ రూపంలో బొప్పాయి, దానిమ్మ పండ్లు, కీర దోస, క్యారెట్లు వంటివి తీసుకోవడం మేలు. ఆహారంలో విటమిన్-ఎ, మరియు సి ఉండేటట్లు చూసుకోవాలి. 
 
ఈ రకమైన ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు. స్నాక్స్ సరైన సమయంలో తీసుకోవాలి. ఉదయం టిఫిన్ తిన్న రెండు మూడు గంటల తరువాత స్నాక్స్ తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనం కొంచెం ముందే  ముగిస్తే, 4 గంటల సమయంలో మళ్లీ స్నాక్స్ తీసుకోవచ్చు. రాత్రి 7  గంటల్లోగా రాత్రిభోజనం తప్పకుండా ముగించాలి. ఈ విధంగా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకు కూరలా? అంతేగా... అనుకోవద్దు...