రోజుకి 8 గంటలు నిద్రపోండి.. రోగ నిరోధక శక్తి పెంచుకోండి..
కాఫీ తాగడం వలన రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. ఆరోగ్యానికి కాఫీతో ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే రోజుకి ఎనిమిది నుంచి పదిగంటల పాటు నిద్రపోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. స
కాఫీ తాగడం వలన రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. ఆరోగ్యానికి కాఫీతో ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే రోజుకి ఎనిమిది నుంచి పదిగంటల పాటు నిద్రపోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సరిపడ నిద్రపోవడం వలన హార్మోన్లు సమతుల్యం అవుతాయి. భావోద్రేకాలు అదుపులో ఉంటాయి. అలాగే రోజు మొత్తం మీద ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి.
రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి నీరు మందుగా పని చేస్తుంది. ఇక క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన అధిక బరువు తగ్గించుకోవడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. వారంలో కనీసం మూడు రోజుల పాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే పోషకాహారం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మినరల్స్ అధికంగా లభించే చేపలు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, గింజలు, విటమిన్ ఎ ఎక్కువగా ఉండే గుడ్లు, లివర్, బిటాకెరోటిన్ ఉండే పాలకూర, చిలగడదుంప, క్యారెట్ వంటివి తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని త్వరితగతిన పెంపొందించుకోవచ్చు.