Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరగడుపున టీ, కాఫీలు తాగకూడదు.. అరటిపండ్లు, కూల్‌డ్రింక్స్ కూడా?

ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. అతిగా తింటే మాత్రం విషం. ఉదయం పూట పరగడుపున టీ, కాఫీలు తాగడం మంచిది కాదు. ఇలా తాగితే హార్మోన్లు అన్‌ బ్యాలెన్స్‌ అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాఫీ, టీలు తప్పక తాగాల

Advertiesment
Food to be avoided empty stomach:Yohurt
, శనివారం, 28 జనవరి 2017 (15:53 IST)
ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. అతిగా తింటే మాత్రం విషం. ఉదయం పూట పరగడుపున టీ, కాఫీలు తాగడం మంచిది కాదు. ఇలా తాగితే హార్మోన్లు అన్‌ బ్యాలెన్స్‌ అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాఫీ, టీలు తప్పక తాగాల్సి వస్తే.. ముందుగా ఒక గ్లాస్‌ మంచి నీటిని తాగిన తర్వాతే కాఫీ, టీ లు తాగటం మంచిది. అలాగే కూల్‌డ్రింక్స్ తాగకూడదు. తాగితే వాటిలోని ఆమ్లాల కారణంగా వికారం, వాంతులు వంటి రుగ్మతలతో ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
అలాగే ఘాటైన మసాలా కూరల్ని పరగడుపున తినకూడదు. అలా తింటే పొట్టలో తిప్పడమే కాక రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. ఇదే పరిస్థితి ఎక్కవ కాలం కొనసాగితే అల్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. అల్పాహారం సులభంగా జీర్ణమయ్యేలా చూసుకోవాలి. చాలా మంది పరగడుపున టమోటా రైస్‌, టమోటా బాత్‌ లాంటివి తింటుంటారు. కానీ ఖాళీ కడుపుతో పుల్లని పదార్థాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. 
 
కాబట్టి ఏదైనా వేరే పదార్థం తిన్న తరువాత పుల్లటి పదార్థాలు తినడం మంచిది. ఇక అరటిపండ్లు పరగడుపున అస్సలు తినకూడదు. అందులో ఉన్న మెగ్నీషియం ఉదయం పూట ఎక్కువ మోతాదులో శరీరానికి అందటం మంచిదికాదంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరికాళ్ళు మృదువుగా ఉండాలంటే.. క్యారెట్ ప్యాక్ వేసుకోండి.