Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుచ్చకాయను తింటే హైబీపీ సులభంగా తగ్గుతుందట..!

పుచ్చకాయను తింటే హైబీపీ సులభంగా తగ్గుతుందట..!
, సోమవారం, 22 ఏప్రియల్ 2019 (18:48 IST)
ప్రస్తుత ప్రపంచంలో ఏదో ఒక కారణం చేత మనిషి ఒత్తిడికి గురవుతున్నాడు. శరీరంలోని ర‌క్త‌నాళాల గోడ‌లపై ర‌క్తం క‌లిగించే పీడ‌నం నిరంత‌రం ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ టెన్ష‌న్ లేదా హై బ్ల‌డ్ ప్రెష‌ర్ అంటారు. బ్లడ్ ప్రెషర్ 140/90 క‌న్నా ఎక్కువగా ఉంటే అప్పుడు హైబీపీ ఉందని చెబుతారు. ఎప్పుడైనా 180/90 ఉంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. 
 
ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకుంటారు. ఈ క్రమంలోనే హైబీపీ రాకుండా మన శరీరాన్ని కాపాడుకోవడానికి మ‌నం నిత్యం తీసుకునే ఆహారం పట్ల నియమాలు పాటించాలి. అప్పుడే బీపీ కంట్రోల్ అవుతుంది. అయితే ఆహారం విష‌యానికి వ‌స్తే బీపీని కంట్రోల్ చేసేందుకు మ‌న‌కు అనేక ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పుచ్చ‌కాయ కూడా ఒక‌టి.
 
పుచ్చకాయలు మనకు వేసవి కాలంలో విరివిగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల హైబీపీ తగ్గుతుందని శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా అధ్యయనాల ద్వారా తెలియజేయడమైనది. అమెరికన్ జ‌ర్న‌ల్ ఆఫ్ హైప‌ర్‌టెన్ష‌న్‌లో సైంటిస్టులు చేప‌ట్టిన ఆ అధ్య‌య‌నాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను కూడా అందులో ప్ర‌చురించారు. ఆ వివరాల ప్రకారం పుచ్చకాయలో ఉండే పలు ఔషధ గుణాలు హైబీపీని తగ్గిస్తాయట. 
 
ముఖ్యంగా పుచ్చకాయలో ఉండే పలు యాంటీ ఆక్సిడెంట్లు ర‌క్త నాళాల‌ను వెడ‌ల్పుగా చేస్తాయ‌ట‌. దీంతోపాటు ర‌క్త‌పోటును కూడా నియంత్రిస్తాయ‌ని వారు చెబుతున్నారు. కాబట్టి హైబీపీ ఉన్న‌వారు పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల బీపీని త‌గ్గించుకోవ‌చ్చ‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధుమేహాన్ని నియంత్రించే బార్లీ గింజలు...